HUSBANDS HAD VAT PUJA IN AURANGABAD TO GET RID OF WIVES PVN
ఏడు జన్మలా,ఏడు సెకన్లు కూడా ఈ భార్యలు మాకొద్దు. వ్రతం చేసిన భార్యబాధితులు
భార్యలొద్దంటూ వ్రతం చేశారు
Husbands puja against wives : భార్య భర్తలు, ఆలుమగలు ఏ పేరుతో పిలిచినా ఒక్కటే. ఈ బంధం అనేది వీడదీయలేని అనుబంధం. భార్యా భర్తల మధ్య అనుబంధం ఎంతో గొప్పదని చెబుతారు. భర్త కోసం భార్య, భార్య కోసం భర్త ఒకరి కోసం ఒకరు బతుకుతుంటారు. ఇద్దరి మధ్య ప్రేమాభిమానాలతో పాటు అప్పుడప్పుడు వచ్చే జగడాలు, గొడవలు వారి మధ్య బంధాన్ని మరింత పెంచుతాయి.
Husbands puja against wives : భార్య భర్తలు, ఆలుమగలు ఏ పేరుతో పిలిచినా ఒక్కటే. ఈ బంధం అనేది వీడదీయలేని అనుబంధం. భార్యా భర్తల(Wife-Husband) మధ్య అనుబంధం ఎంతో గొప్పదని చెబుతారు. భర్త కోసం భార్య, భార్య కోసం భర్త ఒకరి కోసం ఒకరు బతుకుతుంటారు. ఇద్దరి మధ్య ప్రేమాభిమానాలతో పాటు అప్పుడప్పుడు వచ్చే జగడాలు, గొడవలు వారి మధ్య బంధాన్ని మరింత పెంచుతాయి. కొన్నిసార్లు భార్యాభర్తల మధ్య వచ్చే మనస్పర్థలు హృదయంలోనే ఉంటాయి. ఫలితంగా చాలా రోజులు పాటు ఇద్దరి మధ్య నిశ్శబ్దం చోటు చేసుకుంటుంది. ఒకరికొకరు మాట్లాడుకోవడమే ఉండదు. ఎవరు చొరవ తీసుకోవలన్నా ఇద్దరి మధ్య అహం అడ్డు వస్తుంది. ఎదుటవారిపై కోపం అధికంగా ఉండటం వల్ల మౌనం మరింత పెరుగుతుంది. అయితే ఈ భార్యలతో మేం వేగలేం.. ఏడు జన్మలు కాదు కదా ఏడు క్షణాలు కూడా వారిని మేం భరించలేం ..వారు మాకొద్దు అంటూ భార్య బాధితుల సంఘం సభ్యులు పూజలు చేశారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో సోమవారం ఈ ఘటన జరిగింది.
సోమవారం పౌర్ణమి పురస్కరించుకుని నిన్న మహారాష్ట్ర(Maharashtra)లోని ఔరంగాబాద్ జిల్లాలోని వలూజ్ ఏరియాలో పత్నీపీడిత్ అనే పేరుతో నడుస్తున్న భార్యాబాధిత వ్యక్తి ఆశ్రమంలో భార్యాబాధితులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారందరూ కలిసి వట సావిత్రి పూర్ణిమ వ్రతం నిర్వహించారు. ఈ భార్యలు తమకు ఏడేడు జన్మలు కాదని, ఏడు క్షణాలు కూడా తమకొద్దంటూ పీపల్ చెట్టుకు పూజలు చేసి దారాలు కట్టారు. ఈ పూజకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సాధారణంగా ఈ వ్రతాన్ని హిందూ మహిళలు ఆచరిస్తారు. ఏడేడు జన్మలకు ఒక్కరే తన భర్తగా రావాలని కోరుతూ ఈ వ్రతాన్ని చేసుకుంటారు. సావిత్రి తన భర్త సత్యవంతుడిని యమధర్మరాజు నుంచి రక్షించుకుంది. ఈ నేపథ్యంలో తమ భర్తలు కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని, ఏడేడు జన్మలకు వారే తమ భర్తలుగా ఉండాలని కోరుకుంటూ పౌర్ణమి రోజు వటసావిత్ర వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే భార్య బాధితుల సంఘం సభ్యులు మాత్రం విచిత్రంగా ఏడు సెకన్లు కూడా ఈ భార్యలు మాకొద్దు దేవుడా అంటూ ఈ పూజ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఈ సందర్భంగా భార్యాబాధిత సంఘానికి చెందిన ఒకరు మాట్లాడుతూ.. "కొందరు మహిళలకు పీపల్ చెట్టును పూజించే అర్హత లేదన్నారు. తమకు అనుకూలంగా చట్టాలు ఉండడంతో కొందరు మహిళలు భర్తలను వేధిస్తున్నారని, వారి కుటుంబ సభ్యులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఈ ఏకపక్ష చట్టం పురుషులను స్త్రీలకు బానిసలుగా మార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పురుషులకు కూడా సాధికారత కల్పించాల్సిన అవసరం ఉంది"అని అన్నారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.