Home /News /trending /

HUSBAND WILL DONATE A KIDNEY TO HIS WIFE IN AHMEDABAD ON THEIR 23RD MARRIAGE ANNIVERSARY SSR

Valentine Day: ప్రేమికుల రోజున ఇంతకు మించిన గిఫ్ట్ ఏ భర్త తన భార్యకు ఇవ్వలేడేమో..!

వినోద్, రీతా

వినోద్, రీతా

ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 14 రాగానే ప్రేమికుల సందడి కనిపిస్తుంటుంది. ప్రేయసికి ఏ బహుమతి ఇవ్వాలా అని అబ్బాయిలు మల్లగుల్లాలు పడుతుంటారు. కానీ.. ఓ భర్త ప్రేమికుల రోజున, వారి 23వ వివాహ వార్షికోత్సవం రోజున ఏ భార్యకు ఇవ్వని...

    అహ్మదాబాద్: ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 14 రాగానే ప్రేమికుల సందడి కనిపిస్తుంటుంది. ప్రేయసికి ఏ బహుమతి ఇవ్వాలా అని అబ్బాయిలు మల్లగుల్లాలు పడుతుంటారు. కానీ.. ఓ భర్త ప్రేమికుల రోజున, వారి 23వ వివాహ వార్షికోత్సవం రోజున ఏ భార్యకు ఇవ్వని బహుమతిని ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు. కిడ్నీ పాడయిపోయిన భార్యకు తన కిడ్నీని ఇచ్చేందుకు ముందుకొచ్చాడు. పూర్తి వివరాల్లోకి వెళితే... రీతా పటేల్, వినోద్ పటేల్ భార్యాభర్తలు. రీతా గత మూడేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతోంది. అప్పటి నుంచి చికిత్స తీసుకుంటున్నప్పటికీ ఆమె ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. పైగా.. రీతా కిడ్నీ పాడయినట్లు వైద్యులు తెలిపారు. ఆమెకు కిడ్నీ మార్పిడి చేయాలని వినోద్‌కు చెప్పారు. క్షణం కూడా ఆలోచించకుండా తన కిడ్నీని భార్య కోసం ఇచ్చేందుకు ఆ భర్త ముందుకొచ్చాడు.

    వాలంటైన్స్ డే అయిన ఈరోజున రీతా కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరగనుంది. అహ్మదాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమెకు ఈ చికిత్స జరగబోతోంది. రీతాకు కిడ్నీ మార్పిడికి సంబంధించి వైద్యులు మాట్లాడుతూ.. వాలంటైన్స్‌డేన తొలిసారిగా తాము సర్జరీ చేయబోతున్నామని చెప్పారు. వినోద్ మాట్లాడుతూ.. తన భార్య బాధను తాను చూశానని, అందుకే కిడ్నీ దానం చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపాడు. తన భార్య మూడేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతుందని, గత నెల నుంచి డయాలసిస్ కూడా చేయాల్సి వచ్చిందని చెప్పాడు.

    తన బాధను చూసిన తర్వాత కిడ్నీ దానం చేసేందుకు సిద్ధపడ్డానని తెలిపాడు. తన భార్య వయసు ప్రస్తుతం 44 సంవత్సరాలని, ప్రతీ ఒక్కరూ తన భాగస్వామికి గౌరవం ఇవ్వాలన్న సందేశం ఇస్తున్నానని వినోద్ చెప్పాడు. తన భర్త ప్రేమికుల రోజున ఇచ్చిన అరుదైన బహుమతి గురించి రీతా స్పందిస్తూ.. ఇలాంటి భర్తను పొందటం అదృష్టంగా భావిస్తున్నానని, ఆయన వల్లే తాను మళ్లీ సంతోషంగా జీవించేందుకు పునర్జన్మ లభించిందని చెప్పింది.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Valentines day, Valentines Day 2021

    తదుపరి వార్తలు