HUSBAND TOOK SELFIE WITH HIS WIFE IN FRONT OF THE KOCHI INTERNATIONAL STADIUM THAT HAS MOVED US TO TEARS SSR
Viral: ఇంత మంచి వ్యక్తి భర్తగా దొరకడం ఆమె అదృష్టం.. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే..
రమేష్, అజు
భయంకర క్యాన్సర్‌తో భాదపడుతూ ఉన్న తన భార్యను రక్షించడానికి చేయాల్సిందంతా చేస్తున్నాడు ఆ భర్త. డాక్టర్స్ కూడా ఆమెను కాపాడటానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. కొచ్చిలోని ఓ హాస్పిటల్లో రెండోసారి కీమోథెరఫి అబ్సర్వేషన్లో పెట్టారు.
క్యాన్సర్ బారిన పడి బాధపడుతూ ఉన్న తన భార్యను రక్షించడానికి చేయాల్సిందంతా చేస్తున్నాడు ఆ భర్త. డాక్టర్స్ కూడా ఆమెను కాపాడటానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. కొచ్చిలోని ఓ హాస్పిటల్లో రెండోసారి కీమోథెరఫి అబ్సర్వేషన్లో పెట్టారు. ఆమెకు సచిన్ టెండూల్కర్ అంటే చాలా ఇష్టం. కొచ్చిలోని ఇండియన్ పుట్ బాల్ మ్యాచ్ జరుగుతుండటంతో అక్కడికి సచిన్ వెళ్లాడు.
ఫుట్ బాల్ ఆటగాళ్ళలో ఆత్మ విశ్వాసం నింపడానికి సచిన్ అక్కడకు వస్తున్నాడన్న విషయం ఆమెకు తెలిసింది. తన అభిమాన క్రికెటర్ సచిన్ కొచ్చి వస్తున్నాడన్న సంగతి ఆమెకు ఆనందాన్ని కలిగించింది. ఎలాగైనా సచిన్‌ను చూడాలని ఆ ఫుట్ బాల్ మ్యాచ్‌కి తీసుకెళ్లమని తన భర్తను అడిగింది.
ఆయన ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకని.. మరోసారి తీసుకెళ్తానని చెప్పాడు. కానీ నిజమేంటో ఆమె భర్తకు తెలుసు తనకు మరో అవకాశం రాదని, అందుకే మనసు మార్చుకున్నాడు. ఎలాగైనా భార్య కోరిక తీర్చాలనుకున్నాడు. అందుకోసం తన ఫ్రెండ్స్‌కి ఫోన్ చేసి ఎలాగైనా టికెట్స్ కావాలని చెప్పాడు. ఎంత కష్టమైనా క్యూలో ఎంత సేపు నిలబడైనా టికెట్స్ సంపాదించాలని సూచించాడు.
ఇటు పక్క భార్య ఆరోగ్యం మరింత క్షీణిస్తే తనను వెంటనే చికిత్సకి తరలించాల్సి ఉంటుందని.. స్టేడియం దగ్గరో ఉన్న హాస్పిటల్‌కి, అంబులెన్స్‌లకు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వాళ్ళు కావాల్సిన జాగ్రతలు తీసుకున్నారు. ఆమెను తీసుకొని మ్యాచ్‌కి వెళ్ళాడు. వేలాది మంది ప్రేక్షకుల కేరింతలు చూసి ఆమె సంబరపడిపోయింది. సచిన్‌ను చూసింది. ‘సచిన్.. సచిన్’ అనే అరుపులు విని ఆమె బాధనంతా మరిచిపోయింది.
అయితే దురదృష్టవశాత్తూ కొద్దిరోజులకే ఆమె చనిపోయింది. ఆమె జ్ఞాపకాలు భర్తను వెంటాడుతున్నాయి. భార్య చివరి కోరిక తీర్చిన తీరును ఆ సందర్భంలో కలిగిన ఆనందం, అనుభూతిని తన ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. తన ఫ్యామిలీతో స్టేడియంలో దిగిన ఫోటోను కూడా పోస్ట్ చేశాడు. ‘నా భార్య చాలా ధైర్యవంతురాలు. కొద్ది రోజుల్లో చనిపోతుందని తెలిసినా ధైర్యంగా ఉండేది. జీవితం ఎంతో అందమైనది. ప్రతి క్షణం ఆస్వాదించండి. గాడ్ బ్లెస్ యు’ అని రాశాడు. కొడుకును అపురూపంగా చూసుకుంటూ రోజులు గడుపుతున్నానని చెప్పుకొచ్చాడు.
రమేష్ పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. భార్య పట్ల రమేష్ చూపించిన ప్రేమకు నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. భారమైన గుండెతో రమేష్‌కి అభినందనలు చెబుతున్నారు. కొందరు భర్తలు భార్య బ్రతికుండగానే నరకం చూపిస్తున్న ఈ రోజుల్లో రమేష్ లాంటి వాళ్ళు అరుదే కదా. అలాంటి భర్త ప్రేమకు దూరమైన దురదృష్టవంతురాలి పేరు అజు. తన చివరి కోరిక తీర్చిన సమయంలో ఆయన భార్య ఆయనకి ఎంతో అందంగా కనిపించిందట. రమేష్ తన భార్య కోరిక తీర్చి ప్రపంచాన్ని జయించినంత ఆనందాన్ని పొందాడు. కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. కొద్ది రోజులకే రమేష్ భార్య చనిపోయింది.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.