హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Shocking Video: భార్యను సడెన్ గా రైలు కిందకు తోసేసిన భర్త..షాకింగ్ వీడియో

Shocking Video: భార్యను సడెన్ గా రైలు కిందకు తోసేసిన భర్త..షాకింగ్ వీడియో

సీసీటీవీ ఫుటేజి వీడియో

సీసీటీవీ ఫుటేజి వీడియో

Man Pushes Woman Before Moving Train:మెగుడు-పెళ్లాం మధ్యన గొడ‌వ‌లు స‌ర్వ‌సాధార‌ణం. అయితే ఇటీవ‌లి కాలంలో కొంత‌మంది ఈ గొడ‌వ‌ల‌ను సీరియ‌స్ గా తీసుకుని ఆత్మహత్యలకు పాల్పడటం లేదా అవ‌త‌లి వారి ప్రాణాలు తీయ‌డం వంటి ఘ‌ట‌నల‌కు పాల్ప‌డుతున్నారు

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Man Pushes Woman Before Moving Train:మెగుడు-పెళ్లాం మధ్యన గొడ‌వ‌లు స‌ర్వ‌సాధార‌ణం. అయితే ఇటీవ‌లి కాలంలో కొంత‌మంది ఈ గొడ‌వ‌ల‌ను సీరియ‌స్ గా తీసుకుని ఆత్మహత్యలకు పాల్పడటం లేదా అవ‌త‌లి వారి ప్రాణాలు తీయ‌డం వంటి ఘ‌ట‌నల‌కు పాల్ప‌డుతున్నారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి మహారాష్ట్ర(Maharshtra)లో చోటుచేసుకుంది. ఓ వ్య‌క్తి తన భార్యను వేగంగా వ‌స్తున్న రైలు కిందకు తోసి చంపాడు..ఈ దారుణ ఘ‌ట‌న ముంబైకి సమీపంలోని పాల్ఘర్ జిల్లాలోని వసాయి రైల్వే స్టేషన్‌(Vasai Railway Station)లో సోమవారం చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న అంత అక్క‌డ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. ఈ సీసీటీవీ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్(Viral Video) గా మారింది.


వైరల్ అవుతున్న సీసీటీవీ వీడియో క్లిప్ లో... సోమవారం ఉదయం 4:10 గంటల సమయంలో పాల్ఘర్ జిల్లాలోని వసాయి రోడ్ రైల్వే స్టేషన్‌ లోని 5వ నెంబర్ ప్లాట్‌ఫారమ్‌ బెంచీపై ఇద్దరు పిల్లలతో కలిసి నిద్రిస్తున్న మహిళ దగ్గరకు వచ్చిన ఆమె భర్త భార్యను నిద్ర లేపాడు. కొన్ని సెకన్ల పాటు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కనిపిస్తుంది. ఇంతలో పట్టాలపైకి వేగంగా అవధ్ ఎక్స్‌ప్రెస్ రైలు వస్తుండగా హఠాత్తుగా భార్యను పట్టాల వైపుకు బలవంతంగా ఈడ్చుకెళ్లి ప్లాట్‌ఫారమ్‌పై నుంచి తోసేశాడు భర్త. ఆ తర్వాత ప్లాట్‌ఫారమ్‌ బెంచీపై నిద్రిస్తున్న ఇద్దరు పిల్లలను ఎత్తుకుని అతడు పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
నువ్వు కేక బాసు : భారత్ లోని 23 ఏళ్ల ట్విట్టర్ ఫ్రెండ్ ని కలిసిన ఎలాన్ మస్క్


ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి నిందుతుడు, బాధిత మహిళ స్టేషన్‌లోనే ఉన్నారని అధికారులు తెలిపారు. ఘటన జరిగిన తర్వాత నిందితుడు మొదట దాదర్ వెళ్లి అక్కడి నుంచి కళ్యాణ్ కు వెళ్లినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. అతన్ని పట్టుకోవడానికి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించిన పోలీసులు.. థానేలోని భివాండి పట్టణంలో గత రాత్రి అతన్ని అరెస్టు చేశారు. నిందితుడిపై ఐసీసీ సెక్షన్ 302 (హత్య) కింద కేసు న‌మోదుచేసిన‌ట్టు అధికారులు తెలిపారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Crime news, Husband kill wife, Maharashtra, Train, Viral Video

ఉత్తమ కథలు