పశ్చిమ బెంగాల్(West Bengal)లో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. వేద మంత్రాల సాక్షిగా వివాహం చేసుకున్న భార్యను భర్తే తన తమ్ముడికి ఇచ్చి మరోసారి వివాహం చేయడం సంచలనంగా మారింది. ఈ వివాహం వెనుక భర్తకు తన తమ్ముడిపై ఉన్న ప్రేమతో భార్యను ఇచ్చి వివాహం చేయలేదు. వాళ్లిద్దరి మధ్య ఉన్న రహస్య సంబంధం (Extra marital affair)చూసి తట్టుకోలేకపోయాడు. కళ్లారా తన భార్య సోదరుడితో ఏకాంతంగా కనిపించడం చూసి కాపురం చేయనని తెగేసి చెప్పాడు. ఊరి జనం సమక్షంలో తన తమ్ముడుకి ఇచ్చి వివాహం చేసిన సంఘటన వెస్ట్ బెంగాల్లోని నదియా జిల్లా(Nadia)లో చోటుచేసుకుంది.
పాతికేళ్ల తర్వాత మరో పెళ్లి ..
పశ్చిమ బెంగాల్లో అరుదైన సంఘటన జరిగింది. జీవితాంతం భర్తతో కలిసి మెలిసి బ్రతకాల్సిన ఓ వివాహిత మరిదితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త వేరే చోట ఉద్యోగం చేస్తుండటంతో ఇంట్లో ఉంటున్న మరిదిపై మనసు పడింది. ఈక్రమంలోనే ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు. నదియా జిల్లా శాంతిపూర్కు చెందిన అమూల్య దేబ్నాథ్, బబ్లా ప్రాంతానికి చెందిన దీపాలికి 24 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 22 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అతడికి కూడా వివాహమైంది. వృత్తిరీత్యా అమూల్య దేబ్నాథ్ వేరే రాష్ట్రంలో ఉంటున్నాడు.
భార్యను తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేసిన అన్న ..
అమూల్య దేబ్నాథ్ వేరే రాష్ట్రంలో ఉద్యోగం చేస్తుండటంతో అతని సోదరుడు మరిది వరసయ్యే కిశబ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తమ్ముడితో తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకున్న విషయాన్ని గ్రహించిన అమూల్య దేబ్నాథ్ వాళ్లిద్దరు ఏకంతంగా ఉన్న సమయంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. వారి చీకటి బంధాన్ని గ్రామస్తుల సమక్షంలో బయటపెట్టాడు. కట్టుకున్న భార్య సోదరుడితో తప్పు చేయడంతో ఆమెతో ఇక కాపురం చేయడం తన వల్ల కాదని తేల్చిచెప్పాడు. గ్రామస్థుల సమక్షంలోనే తన సోదరుడు కిశబ్తో భార్యకు మళ్లీ పెళ్లి చేశాడు భర్త.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.