Home /News /trending /

HUSBAND AND WIFE VARIETY CONTRACT FOR SEPARATION IN GUJARAT CITY COUPLE SIGN IT PAH

OMG: ఇదేక్కడి అగ్రిమెంట్ రా బాబు.. దంపతుల మధ్య ఇలాంటి కాంట్రాక్ట్ ఎప్పుడు చూసుండరు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Gujarat: పెళ్లయ్యాక ఆలు మగల మధ్య గొడవలు జరగటం కామన్. కొందరు దీన్ని ఇద్దరు కూర్చుని మాట్లాడుకుని తమ సమస్యలను పరిష్కరించుకుంటే.. మరికొందరు ఆవేశంతో కోర్టుల వరకు వెళ్తుంటారు.

Husband and wife variety Contract for separation in gujarat: ఒకప్పుడు దాంపత్య బంధానికి ఎంతో విలువ ఉండేది. అసలు ఒకరితో మరోకరికి ఏమాత్రం సంబంధం లేనివారు పెళ్లి బంధంతో ఒక్కటై ఒక కొత్త జీవితం ప్రారంభిస్తారు. పెళ్లి జరిగాక.. ఒకరి పట్ల మరోకరు అర్థం చేసుకొవడానికి సమయం పడుతుంది. ఇరువురు పెరిగిన కుటుంబ పరిస్థితులు వేర్వేరుగా ఉంటాయి. దీంతో కొద్దిగా బేధాభిప్రాయాలు (Family disputes)  కల్గటం సహాజమే. కొందరు దీన్ని అర్థం చేసుకుని సామరస్యంగా పరిష్కరించుకుని ఉత్తమ మైన జంటగా ఆదర్శంగా నిలుస్తారు.

మరికొందరు చిన్నవిషయాలకే గొడవలు పడుతు, కోర్టుల వరకు వెళ్లి తమ పరువును బజారుకు ఈడ్చుకుంటారు.  అయితే, కొందరు గొడవలు కాగానే డైవర్స్ (Divorce) లను కొరుకుంటారు. అయితే, ఇక్కడ ఒక జంట మధ్య గొడవలు సంభవించాయి. కానీ వారు డైవర్స్ తీసుకొలేదు. దానికి బదులు ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ప్రస్తుతం ఇది వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. గుజరాత్ లోని (Gujarat) వడోదకు చెందిన ఒక కుటుంబం మధ్య గొడవలు సంభవించాయి. వీరికి 19 ఏళ్ళ క్రితం పెళ్లయ్యింది. కొన్నేళ్లపాటు వీరి కాపురం బాగానే సాగింది. వీరికి ఇద్దరు పిల్లలు. ఈ మధ్యకాలంలో గొడవలు (Family disputes) కాస్త ఎక్కువయ్యాయి. దీంతో ఇద్దరు వెర్వేరుగా ఉండాలను కున్నారు. దీని కోసం ఒక కాంట్రాక్ట్ ను కూడా చేసుకున్నారు. దీని ప్రకారం.. భర్త.. తన భార్య పిల్లలు ఉండటానికి ఇల్లు, కారు, ఇచ్చారు. ఆ తర్వాత.. పిల్లల చదువులు, ఆరోగ్యం విషయంలో ఖర్చును (Maintenance expenses) భరించడానికి అంగీకరించాడు. అదే విధంగా, ప్రతి నెల వీరికి మెయింటెనెన్స్ ఖర్చు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. కానీ కోర్టులకు వెళ్లి డైవర్స్ మాత్రం కోరలేదు. అయితే, అతను 30 లక్షల డబ్బును ఒక్కసారే ఇస్తానని తెలిపాడు.

కానీ అతని భార్య దీనికి ఒప్పుకోలేదు. ప్రతి నెల అగ్రిమెంట్ (Variety agreement) ప్రకారం తన కుటుంబాన్ని చూసుకొవాలని కోరింది. అయితే, ఒక సంవత్సరం పాటు, భర్త అగ్రిమెంట్ ప్రకారం డబ్బులు ఇచ్చాడు. కానీ ఆ తర్వాత.. మళ్లీ వీరి మధ్య గొడవలు జరిగాయి. దీంతో అతను డబ్బులు  ఇవ్వడం మానేశాడు. దీంతో సదరు మహిళ ఫ్యామిలీ కోర్టులో మెయింటెనేన్స్ డబ్బులు ఇప్పించాలని పిటిషన్ వేసింది. కానీ తన భర్త మీద ఎలాంటి తప్పుడు కేసులు కానీ, డైవర్స్ కోసం కోర్టులో పిటిషన్ లు  వేయలేదు. ప్రస్తుతం ఈ విచిత్రమైన కేసు వార్తలలో నిలిచింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Family dispute, Gujarat, Wife and husband

తదుపరి వార్తలు