హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Shocking News: భార్య శవాన్ని ఇంట్లో పెట్టుకొని మూడ్రోజుల తర్వాత భర్త, కొడుకులు ఏం చేశారో తెలుసా..?

Shocking News: భార్య శవాన్ని ఇంట్లో పెట్టుకొని మూడ్రోజుల తర్వాత భర్త, కొడుకులు ఏం చేశారో తెలుసా..?

dead body(FILE PHOTO)

dead body(FILE PHOTO)

Shocking News: భార్య చనిపోతే అంత్యక్రియలు నిర్వహించాల్సిన భర్త శవాన్ని ఇంట్లో పెట్టుకొని మూడ్రోజుల తర్వాత ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు. తమిళనాడులో విద్యావంతులు ఉన్న ఇంట్లో ఈ సంఘటన జరగడం సంచలనంగా మారింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Madurai, India

ప్రజల్లో మూఢనమ్మకలపై విశ్వాసం ఇంకా తగ్గడం లేదు. చాదస్తం, పిచ్చి నమ్మకంతో ఎక్కడో మారు మూల గ్రామాల్లో కొందరు వ్యక్తులు చేసే చేసే పనులు చూసి ఆశ్చర్యపడే వాళ్లం. కాని ఇప్పుడు అలాంటి పైత్యం చాలా మందిలో ఉందని తమిళనాడు(Tamilnadu)లో జరిగిన ఓ సంఘటన ఉదాహరణగా నిలిచింది. కట్టుకున్న భార్య చనిపోతే అంత్యక్రియలు(Funeral)నిర్వహించాల్సిన భర్త శవాన్ని ఇంట్లో పెట్టుకొని మూడ్రోజుల తర్వాత ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు. అయితే ఇదంతా భర్త తన ఇష్టపూర్వకంగా కాకుండా కొడుకులు చెప్పిన మాటలను నమ్మే చేయడం అందర్ని షాక్‌కి గురి చేసింది. ఇంకా విచిత్రం ఏమిటంటే..కొడుకుల్లో ఒకరు ఎంబీబీఎస్‌(MBBS) చదువుతుండగా..మరో కొడుకు మెడిసిన్(Medicine)కంప్లీట్ చేశాడు. ఇంత విద్యావంతులు ఉన్న ఇంట్లో ఈఘటన జరగడంతో వార్త వైరల్(Viral news) అవుతోంది.

Heavy Rains: అక్కడ భయపెడుతున్న భారీ వర్షాలు .. 23జిల్లాల్లోని స్కూల్స్‌, కాలేజీలకు సెలవు

షాకింగ్ న్యూస్ ..

తమిళనాడు రాష్ట్రం మదురైలో షాకింగ్ న్యూస్ ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరునల్వేలి జిల్లా కళక్కాడు మండలం చిదంపరాయపురంకు చెందిన బాలకృష్ణన్‌ అనే వ్యక్తి తన భార్య చనిపోతే అంత్యక్రియలు నిర్వహించకుండా శవాన్ని ఇంట్లోనే మూడ్రోజుల పాటు ఉంచాడు. అటుపై మూడో రోజు చనిపోయిన తన భార్యకు ప్రాణం వస్తుందని ప్రార్ధనలు చేయడం స్థానికంగా కలకలం రేపింది. ఈసంఘటన మదురైలోని ఎస్‌ఎస్‌ కాలనీ జానకి నారాయణ్‌ వీధిలోని ఓ ఆపార్ట్‌మెంట్‌లో చోటుచేసుకుంది.

చనిపోయిన మహిళ బ్రతుకుతుందని..

మృతురాలు మాలతితో పాటు ఇద్దరు కొడుకులతో కలిసి బాలకృష్ణన్‌ కాలనీలో నివాసముంటున్నాడు. ఓ హోటల్‌లో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. అయితే ఈ నెల 8వ తేదిన మాలతి అనారోగ్యంతో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. మృతదేహాన్ని అంబులెన్స్‌లో ఇంటికి తెచ్చిన కుటుంబ సభ్యులు డెడ్‌బాడీని ఐస్ బాక్స్‌లో ఉంచారు. మరుసటి రోజు అంత్యక్రియలు నిర్వహించకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు నిలదీయడంతో దూర ప్రాంతాల నుంచి బంధువులు రావాలని అబద్దం చెప్పారు. మూడో రోజు కూడా అంత్యక్రియలు నిర్వహించకుండా ఇంట్లోనే భద్రంగా పెట్టుకోవడంతో స్థానికులు మరోసారి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు.

ఇంట్లో శవానికి ప్రార్ధనలు..

కాలనీ వాసుల ఫిర్యాదుతో పోలీసులు బాలకృష్ణన్‌ ఇంటికి వెళ్లారు. అయితే బాలకృష్ణన్‌ పోలీసుల్ని ఇంట్లోకి రానివ్వకుండా ఇంటి బయటే అడ్డుకోవడంతో పాటు లోపలికి వస్తే సూసైడ్ చేసుకుంటానని చెప్పి తలుపుకు తాళం వేశాడు. బాలకృష్ణన్‌ ప్రవర్తపై అనమానం వచ్చిన పోలీసులు కిటికీలోంచి చూడటంతో ఇద్దరు కుమారులతో కలసి భార్య మృతదేహం ఉంచిన బాక్స్‌ దగ్గర ప్రార్ధనలు చేయడం కనిపించింది. ఒక్కసారిగా నిర్ఘంతపోయిన పోలీసులు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది.

Viral video: బారాత్‌లో డ్యాన్స్‌ వీడియోకి 30లక్షల వ్యూస్ .. ట్రెండ్ సెట్ చేసిన వీడియో ఇదే..

మూఢనమ్మకంతో ..

చర్చ్‌లో పాస్టర్‌గా దైవ ప్రవచనాలు చెబుతున్న బాలకృష్ణన్ ఇటీవలే మతం మార్చుకున్నాడని తేలింది. అంతే కాదు తన ఇద్దరు కొడుకులు కూడా డాక్టర్‌ చదువుతున్నారు. అయితే భార్య చనిపోయిన మూడో రోజు శవం దగ్గర ప్రార్ధన చేస్తే తిరిగి ప్రాణం వస్తుందనే కొడుకులు చెప్పిన మాట నమ్మి ఈవిధంగా ప్రవర్తించినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే చనిపోయిన భార్య శవపేటికలోంచి సజీవంగా లేవకపోవడంతో బంధువులు, చర్చ్ పాస్టర్ల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించాడు బాలకృష్ణన్. అసలు జరిగినదంతా తెలుసుకున్న పోలీసులు, స్థానికులు మూఢనమ్మకాలతో ఇంత విచిత్రంగా ప్రవర్తించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

First published:

Tags: Tamilnadu, VIRAL NEWS

ఉత్తమ కథలు