హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

మహిళా ఎమ్మెల్యేపై ఆమె భర్త అరాచకం.. అందరి ముందే దాడి.. వీడియో వైరల్..

మహిళా ఎమ్మెల్యేపై ఆమె భర్త అరాచకం.. అందరి ముందే దాడి.. వీడియో వైరల్..

మహిళా ఎమ్మెల్యేను కొడుతున్న ఆమె భర్త

మహిళా ఎమ్మెల్యేను కొడుతున్న ఆమె భర్త

Punjab: ఆప్ ఆద్మీపార్టీ ఎమ్మెల్యే బల్జీందర్ కౌర్ కు చేదు అనుభవం ఎదురైంది. అందరి ముందే ఆమె భర్త చెంపమీద లాగిపెట్టి కొట్టారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Punjab, India

మహిళలపై వివక్షత రూపుమాపడానికి ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన, అవి సరిగ్గా అమలు కావడం లేదు. ఇప్పటికే అనేక చోట్ల మహిళలు, వివక్షతకు, వేధింపులకు గురౌతున్నారు. మహిళలను ఇంట్లో వారు కూడా తక్కువగా చూస్తున్నారు. అదే విధంగా.. పని ప్రదేశంలో కూడా మహిళలను చిన్న చూపు చూస్తున్నఘటనలు తరచుగా మనంవార్తలో నిలుస్తున్నాయి. మహిళా అధికారులు, రాజకీయ నాయకులు కూడా వేధింపులకు గురౌతున్నారు. ఈ కోవకు చెందిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు.. పంజాబ్ లోని (Punjab) ఆమ్ ఆద్మీ పార్టీ  (AAP MLA) ఎమ్మెల్యేకు దారుణమైన అవమానం ఎదురైంది. పంజాబ్ ఎమ్మెల్యే బల్జీందర్ కౌర్ ను ఆమె భర్త.. ఆప్ నాయకుడు అంది ముందే చెప్పుతొ కొట్టినట్లు వీడియో వైరల్ గా మారింది. ఈ ఘటన తల్వండి సాబోలోని ఎమ్మెల్యే ఇంట్లో జరిగింది. భర్త సుఖ్ రాజ్ సింగ్, అతని భార్య... ఎమ్మెల్యే కౌర్ తో ఇంట్లో వాగ్వాదానికి దిగారు. దీంతో భర్త.. కంట్రోల్ తప్పి.. అందరి ముందే భార్యను నోటికొచ్చినట్లు తిట్టి చెప్పుతో కొట్టాడు. ఈ వీడియో స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఈ ఘటన జూలై 10న చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో (Social media) వైరల్ గా (Viral video)  మారింది.


అయితే.. దీనిపై జాతీయ మహిళ కమిషన్ సీరియస్ అయ్యింది. ఈ సంఘటనను సుమోటోగా తీసుకుని, వివరణ ఇవ్వాలని నోటిసులు జారీ చేసింది. ఒక నియోజక వర్గంలో ప్రజల సమస్యలను లేవనెత్తే మహిళా నాయకురాలు ఈ విధంగా వేధింపులను ఎదుర్కొవడం పట్ల మహిళ కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా శ్రీమతి కౌర్.. 2019 లో ఆప్ మజా ప్రాంతానికి యువజన విభాగం కన్వీనర్ అయిన సుఖ్ రాజ్ సింగ్ ను పెళ్ళి చేసుకున్నారు.

ఆమె AAP జాతీయ కార్యవర్గంలో సభ్యురాలు మరియు పంజాబ్‌లో పార్టీ మహిళా విభాగానికి నాయకత్వం వహిస్తున్నారు. ఆమె రాజకీయాల్లోకి రాకముందు.. ఫతేఘర్ సాహిబ్‌లోని మాతా గుజ్రీ కాలేజీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆమె ఆప్‌లో చేరి 2017లో పంజాబ్‌లో తన మొదటి ఎన్నికల్లో గెలిచారు. ఇప్పుడు రెండోసారి ఎమ్మెల్యే గా కొనసాగుతున్నారు. ఎమ్మెల్యే భర్తపై చర్యలు తీసుకోవాలని అకాలీదళ్‌కు చెందిన కేంద్ర మాజీ మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ డిమాండ్ చేశారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: AAP, Punjab, Viral Video

ఉత్తమ కథలు