ఆకలి అయినప్పుడు మొహమాట పడకూడదు. ఎవరైనా ఏమైనా అనుకుంటారని అస్సలు సంకోచించకూడదు. దొరికింది తినేయడమే..! అది మనుషులైనా...మూగ జీవాలైనా..! ఓ చిలుక కూడా ఇదే పనిచేసింది. బాగా ఆకలిగా ఉండడంతో మహిళ చేతిలోని యాపిల్ పండును కొరుక్కు తినింది చిలుక. ఈ వీడియోను IFS అధికారి సుశాంత నంద ట్వీట్ చేయడంతో వైరల్గా మారింది. ఓ మహిళ యాపిల్ పండు తింటూ నడుచుకుంటూ వెళ్తోంది. ఎక్కడి నుంచి వచ్చిందో గానీ.. ఓ చిలుక రివ్వున వచ్చి పండుపై వాలింది. పండుపై కూర్చొని అదే పండును ముక్కుతో పొడుచుకు తిన్నది. పాపం.. చిలుకకు ఎంత ఆకలయిందో అని.. ఆ మహిళ కూడా ఏమనలేదు. కడుపు నిండా యాపిల్ పండు తిన్న తర్వాత చిలుక ఎగిరిపోయింది. చిలుక యాపిల్ పండును తింటున్న దృశ్యాలను ఆ మహిళ కెమెరాల్లో రికార్డు చేసి సోషల్ మీడియో పోస్ట్ చేసింది.
ఇది ఎక్కడ జరిగిందో.. ఎప్పుడు జరిగిందో స్పష్టత లేకున్నప్పటికీ.. IFS అధికారి సుశాంత నంద ట్వీట్ చేసిన వీడియోను నెటిజన్లు విపరీతంగా లైక్ చేస్తున్నారు. పాపం.. చిలుకకు ఎంత ఆకలయిందో అని జాలిపడుతున్నారు. అదే సమయంలో చిలుకకు పండును ఇచ్చిన మహిళలను అందరూ మెచ్చుకుంటున్నారు. మానవత్వం అంటే ఇదేనంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:September 03, 2020, 06:41 IST