Video : తనను తానే మింగేసుకున్న పాము... వేరే పాము అనుకుంటూ...

ఆకలి రుచి ఎరగదంటారు... ఆకలి స్పృహ కూడా ఎరగదన్నట్లు అనిపిస్తుంది ఈ దృశ్యం చూస్తే. ఆకలితో ఉన్న ఆ పాము... తన తోకను తానే మింగేసింది. అది వేరే పాము అనుకుని పొరపాటు పడింది.

Krishna Kumar N | news18-telugu
Updated: August 15, 2019, 8:42 AM IST
Video : తనను తానే మింగేసుకున్న పాము... వేరే పాము అనుకుంటూ...
ఇలా ఎలా? (Image : FB - Forgotten Friend Reptile Sanctuary)
Krishna Kumar N | news18-telugu
Updated: August 15, 2019, 8:42 AM IST
సోషల్ మీడియాలో ఇప్పుడో వింత వీడియో చక్కర్లు కొడుతోంది. పెన్సిల్వేనియాలో ఆకలితో ఉన్న కింగ్ స్నేక్... నోరు తెరచి... మరో పామును మింగేందుకు రెడీ అయ్యింది. ముందుగా ఆ పాము తోకను నోట్లోకి లాగేసుకుంది. తర్వాత మొత్తం పామును మింగేద్దామని కొద్ది కొద్దిగా ట్రై చెయ్యసాగింది. అప్పుడే అక్కడకు వచ్చిన దాని ఓనర్ జెస్సీ రొథాకెర్ చూసి షాకయ్యాడు. ఎందుకంటే... ఆ పాము మింగుతున్నది మరో పామును కాదు... దాన్ని అదే మింగుకుంటోంది. ఆ తోక ఏ పాముదో కాదు... దానిదే. ఇదేంటిది... దీన్ని ఇదే మింగేసుకుంటోంది... ఏమైంది దీనికి అనుకుంటూ... మెల్లిమెల్లిగా తోకను బయటకు లాగేందుకు ప్రయత్నించాడు. అందుకు ఒప్పుకోని ఆ స్నేక్... మరింతగా తోకను లోపలికి లాగేసుకునేందుకు ప్రయత్నించింది. దాదాపు 30 శాతం తోకను లోపలికి లాగేసుకుంది.

రొథాకెర్ ప్రయత్నాల వల్ల చివరకు ఆ పాము... తనను తాను మింగడం ఆపేసింది. అలా ఆ పామును కాపాడిన రొథాకెర్... ఆ వీడియోని ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశాడు. వారంలో ఈ వీడియోని 2లక్షల మందికిపైగా చూశారు. సహజంగా పాములు... తమ గుడ్లను అవే మింగేస్తుంటాయి. ఇక్కడ పాము... తనను తానే మింగేస్తుండటం... అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

First published: August 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...