మనకు ఆకలైతే వండుకొని తింటాం. లేదంటే హోటల్‌కి వెళ్తాం. అధీ సాధ్యం కాకుంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసి ఎంచక్కా లాగిస్తాం. కానీ వన్య ప్రాణాలు, సముద్ర జీవులు అలా కాదు. ప్రకృతిలో దొరికిందే తినాలి. శాఖాహార జంతువులతే ఏ ఫలాన్నో.. గడ్డినో.. తినేస్తాయి. మరి మాంసాహార జంతువుల సంగతేంటి..? కనిపించిన జీవిని వేటాడి.. ఆ తర్వాతే తినాలి. అలా వేటాడే క్రమంలో ఎన్నో అవాంతరాలు ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు వేట దొరకక ఆకలితో అల్లాడిపోతాయి. అలాంటి ఆకలితో అలమటించిన ఓ మొసలి.. దాని బారి నుంచి చాకచక్యంగా తప్పించుకున్న తాబేలు ఒరిజినల్ స్టోరీ ఇది.
ఆకలితో అల్లాడిపోయిన ఓ మొసలి నదీ ఓడ్డుకు వచ్చింది. వేట కోసం వెతుకుతున్న క్రమంలో తాబేలు కనిపించింది. బాగా ఆకలిగా ఉంది.. ఏదో ఒకటి దొరికిందిలే..అని మనసులో అనుకుంది. ఆ మొసలిని చూసిన తాబేలు.. అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేసింది. కానీ అది స్పీడ్‌గా వెళ్లలేదు.. మెల్లగా వెళ్తుంది. అలా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తూ..చివరకు మొసలికి చిక్కింది. ఇవాళ్టికి ఆహారం దొరికిందిలే అని.. తాబేలును నోట కరచుకుంది మొసలి. తన పొడవాటి పదునైన పళ్లలతో తాబేలును కొరికేందుకు ప్రయత్నించింది. కానీ తాబేలుపై ఉండే ధృడమైన పెంకు.. దానికి దేవుడిచ్చిన వరం..! ఎంతో ధృడంగా ఉండే ఆ చిప్పను కొరకలేకపోయింది మొసలి. అలా రెండు సార్లు ప్రయత్నించింది విఫలమయింది.
చివరకు మొసలి చేసిన మూడో ప్రయత్నం కూడా విఫలమైంది. ఈసారి నోటి నుంచి జారిపోయి బయటపడింది తాబేలు. బతకు జీవుడా అనుకుంటూ.. చిట్టి చిట్టి కాళ్లతో జంప్ చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ మొత్త ఎపిసోడ్ అంతా కెమెరాలో రికార్డయింది. ఆ వీడియోను ఐఆర్ఎస్ అధికారి నవీద్ త్రుంబూ ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది.
వాస్తవానికి ఈ వీడియో ఇప్పటిది కాదు. మూడేళ్ల కిందే యూబ్యూట్‌లో పోస్ట్ చేశారు. అమెరికా సౌత్ కరోలినాలోని హిల్టన్ హెడ్ ఐలాండ్‌లో ఈ ఘటన జరిగింది.
Published by:Shiva Kumar Addula
First published:September 18, 2020, 11:09 IST