HUNDREDS OF VILLAGE PEOPLE SHIFTS A HOUSE WITH THEIR HANDS IN NAGALAND VIDEO GETTING VIRAL HSN
Viral Video: ఓర్నీ.. ఇంటిని ఓ చోట నుంచి మరో చోటకు ఇలా కూడా తరలిస్తారా..?
ఇంటిని తరలిస్తున్న గ్రామ ప్రజలు
పెద్ద పెద్ద అపార్ట్ మెంట్లను కూడా పైకి లేపడమో, లేదా కాస్త పక్కకు జరపడమో చేసిన ఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ చోట మాత్రం ఓ ఇంటిని ఓ చోట నుంచి మరో చోటకు ఈజీగా యమా ఈజీగా తరలించేశారు. ఎలాంటి పరికరాలను వాడలేదు. కేవలం కర్రలతోనే..
ఇల్లు కట్టి చూడు-పెళ్లి చేసి చూడు అనేది మన పెద్దలు ఎప్పుడో చెప్పిన సామెత. ఓ పెళ్లిని చేయడానికి ఎన్ని కష్టాలు పడాలో, ఇంటిని కట్టేందుకు కూడా అన్ని కష్టాలు పడాల్సి ఉంటుందన్నడానికి ఆ సామెతను వాడుతుంటారు. సొంతింటిని కట్టుకునేటప్పుడు తమకు నచ్చిన విధంగా ఉండేందుకు తెగ ఆలోచిస్తుంటారు. ఏది ఎక్కడ ఉండాలో స్వయంగా డిసైడ్ చేస్తుంటారు. ఇంటి నిర్మాణం కోసం అవసరమయ్యే డబ్బు కోసం తిప్పలు పడుతుంటారు. అలా ఏరికోరి కట్టుకున్న ఇంటికి వాస్తుదోషమనో, కొన్నేళ్ల తర్వాత రోడ్డుకంటే తక్కువ ఎత్తులో ఉందనో, కుటుంబానికి మంచిది కాదనే కారణాలతో ఇంట్లో మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే తక్కువ ఎత్తులో ఉన్న ఇళ్లను యంత్రాలతో పైకి లేపే టెక్నిక్స్ కూడా వచ్చాయి.
పెద్ద పెద్ద అపార్ట్ మెంట్లను కూడా పైకి లేపడమో, లేదా కాస్త పక్కకు జరపడమో చేసిన ఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ చోట మాత్రం ఓ ఇంటిని ఓ చోట నుంచి మరో చోటకు ఈజీగా యమా ఈజీగా తరలించేశారు. వంద మందికి పైగా స్థానికులు కర్రల సాయంతో చేతుల్తోనే ఓ ఇంటిని ఓ చోట నుంచి మరో చోటకు తరలించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇలా కూడా జరుగుతుందా? అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Yet another video where the Nagas show us that Unity is strength!
నాగాలాండ్ లోని ఓ జాతికి సంబంధించిన ప్రజలు ఓ ఇంటిని ఓ చోట నుంచి మరో చోటకు జరిపేందుకు ఎలాంటి యంత్రాలను వాడలేదు. కలిసి ఉంటే కలదు సుఖం అనే సామెతను కలిసి ఉంటే కలదు బలం గా మార్చి, ఓ ఇంటిని ఓ చోట నుంచి మరో చోటకు తరలించారు. అయితే అది సిమెంట్ గోడలతో కట్టిన ఇల్లు కాదు కాబట్టి తరలించడం చాలా సులభం అయింది. దీనికి సంబంధించిన వీడియోను సుధా రామన్ అనే అటవీ శాఖ అధికారి తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. మరి ఆ వీడియోను మీరు కూడా ఓ లుక్కేయండి.