Home /News /trending /

HUNDREDS OF COCKROACHES RELEASED DURING HEARING AT NEW YORK COURT PAH

OMG: వామ్మో.. కోర్టులో ఉన్న వారికి చుక్కలు చూపించిన మహిళ.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

New York: మహిళ స్థానికంగా కొందరితో గొడవలకు దిగింది. దీంతో ఆమె చేష్టలను భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో.. ఆమెను పోలీసులు అదుపులోనికి తీసుకొని కోర్టులో ప్రవేశపెట్టారు.

సాధారణంగా ప్రజలు తరచుగా తమకు ఏదైన విషయంలో సరైన న్యాయం దొరక్కపోతే నిరసనలు తెలియజేస్తారు. అయితే, వీరు తమ వ్యతిరేకతను (Protest) తెలపడానికి ఒక్కొమార్గాన్ని పాటిస్తారు. ప్రభుత్వాల తీరు, పోలీసుల తీరు, తరచుగా వివాదాస్పదమై వార్తలలో ఉంటుంటాయి. ప్రజలు, విద్యార్థులు, ఒక్కొసారి రోడ్లమీద టెంట్ లు వేసుకొని మరీ నిరసన తెలియజేస్తుంటారు. మరీ కొందరు నోటికి నలుపు రంగు బట్ట, షర్ట్, నల్ల బ్యాడ్జీ లు వేసుకుని మరీ నిరసన తెలియజేస్తారు. మరీ కొందరు రాస్తారోకోలు, ధర్నాలు చేస్తుండటం మనకు తెలిసిందే. కొన్ని సార్లు తమకు గిట్టని వారిమీద పాములు, బల్లులు, కుక్కలను ఉసిగొల్పడం లాంటివి గతంలో అనే సంఘటనలు వార్తలలో నిలిచాయి. అయితే, ఇక్కడో మహిళ వింతగా ప్రవర్తించింది. కోర్టులో ఉన్న వారికి చుక్కలు చూపించింది. ప్రస్తుతం ఈ ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. న్యూయార్క్ లో (New York) ఈ ఘటన జరిగింది. 34 ఏళ్ల మహిళను స్థానికంగా గొడవలు చేసిందనే కారణంతో పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను అల్బానీ సిటీలోని కోర్టులో హజరుపర్చారు. అక్కడ కోర్టులో విచారణ (Hearing) ప్రారంభమైంది. కాసేపు కోర్టులో.. హాట్ హాట్ గా ఆరోపణలు, ప్రత్యారోపణలు జరిగాయి. దీంతో మహిళ రెచ్చిపోయింది. ఆ తర్వాత.. తనకు తెలిసిన వారితో కోర్టులో డబ్బాల నిండా బొద్దింకలను తీసుకొచ్చింది. అక్కడ విచారణ జరుగుతుండగా మెల్లగా బొద్దింకలను నేలపైన గుమ్మరించారు.



కుప్పలు, కుప్పలుగా బొద్దింకలు (Cockroaches) కోర్టు హల్ లో కన్పించడంతో కోర్టులో(Court)  ఉన్న వారు భయంతో పరుగులు పెట్టారు. దీంతో కోర్టు కార్యకలాపాల్లో తీవ్రమైన అంతరాయం ఏర్పడింది. ఇదంతా మహిళ కావాలని చేసిన పనిగా బయటపడింది. దీంతో కోర్టు ఆమె చేసిన పనిని తీవ్రంగా పరిగణించింది. ఆమె చేసిన పనివల్ల కోర్టులో ప్రొసిడింగ్స్ కు తీవ్రమైన అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రస్తుతం ఆమెను పోలీసులు కస్టడీలోనికి తీసుకొని విచారిస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేసిన తింగరి పని నెట్టింట (Social media) వైరల్ గా (Viral news) మారింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Cockroach, Courts, New york, Trending news, VIRAL NEWS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు