హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Krishnashtami: దహీ హండీ వేడుకలో అపశృతి.. వందలాది కళ్లముందే.. 150 మంది...

Krishnashtami: దహీ హండీ వేడుకలో అపశృతి.. వందలాది కళ్లముందే.. 150 మంది...

దహీ హండీ వేడుక

దహీ హండీ వేడుక

Mumbai: జన్మాష్టమి వేడుకలో ఘనంగా జరుగుతున్నాయి. స్థానికంగా ఉన్న భక్తులు, మరికొందరితో కలసి దహీ హండీ వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇంతలో అనుకొని ఘటన సంభవించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Mumbai, India

ముంబైలో (Mumbai) జన్మాష్టమి పండుగ సందర్భంగా భక్తులు పెద్దఎత్తున థానేలోని స్థానిక ఆలయంలో చేరుకుని ఘనంగా కృష్ణాష్టమి (krishnashtami) కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భక్తులు దీనిలో భాగంగా ఆలయం పరిసరాల్లో శుక్రవారం జరిగిన దహీ హండీ వేడుక కోసం మానవ పిరమిడ్‌గా ఏర్పాడ్డారు. 'గోవింద పథక్స్' సంఘంలోని దాదాపు 150 మంది సభ్యులు.. ఒకరిమీద మరోకరు నిలువుగా ఏర్పాడ్డారు. అప్పుడు ఒక్కసారిగా షాకింగ్ ఘటన జరిగింది. కింద వందలాది మంది భక్తులు ఉన్నారు. పిరమిడ్ లా ఏర్పడటానికి ఒకరిపై మరోకరు ఎక్కుతున్న భక్తులు అదుపుతప్పి కింద పడిపోయారు.

దాదాపు.. 150 మంది సభ్యులు బ్యాలెన్స్ తప్పి కింద పడ్డారు. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడి వారు భయంతో పరుగులు పెట్టారు. కాసేపు అక్కడ ఏం జరుగుతుందో కూడా.. ఏవరికి అర్థం కాలేని పరిస్థితి నెలకొంది. గాయపడిన వారిని అత్యవసరంగా నగరంలోని ఆసుపత్రులకు తరలించారు.

వీరిలో 130 మందికి సాధారణ గాయాలయ్యాయని, మరో 23 మంది ఆస్పత్రిలోనే ఉన్నట్లు బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) అధికారులు తెలిపారు. కాగా, థానేలో జన్మాష్టమి (Janmashtami)  పండుగను విస్తృతంగా జరుపుకుంటారు. వివిధ దహీ హండి టోర్నమెంట్‌లు జరుగుతాయి. నగరం అంతటా జరుగుతున్న దహీ హండీ ఈవెంట్‌లను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు తరలివచ్చారు.

ఇదిలా ఉండగా ఒక మొసలి చేసిన పని ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ గా  మారింది.

ఈ ఘటన జరిగినప్పటికీ పోలీసులు ఇప్పటి వరకు మృతదేహాన్ని వెలికితీయలేకపోయారు. నిజానికి మొసలి వేటాడినప్పటి నుండి శవాన్ని నిరంతరం కాపాడుతోంది. అయితే శవం దగ్గరకు ఎవరినీ రానివ్వడం లేదు. మొసలి కారణంగానే శవాన్ని స్వాధీనం చేసుకోలేకపోతున్నామని పోలీసులు కూడా నిర్ధారించారు. సోమవారం పదకొండు గంటల ప్రాంతంలో చెరువులో శవానికి మొసలి కాపలాగా ఉందని చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు అక్కడికి వెళ్లగా వారు కూడా మృతదేహాన్ని వెనక్కి తీసుకోలేకపోయారు. మృతదేహంపై అధికార యంత్రాంగం నిత్యం నిఘా పెడుతోంది. మొసలి దృష్టి దాని నుండి మరలిన వెంటనే, పోలీసులు వెంటనే శవాన్ని దాని స్వాధీనంలోకి తీసుకుంటారు. ఈ శవం ఉన్న చెరువు మొసళ్లతో నిండి ఉంది. సెంటర్స్ ఫర్ డిసీజ్ అండ్ ప్రివెన్షన్ నివేదిక ప్రకారం.. 1999 మరియు 2019 మధ్య యుఎస్‌లో కేవలం పది మొసళ్ల దాడులు మాత్రమే నమోదయ్యాయి.

Published by:Paresh Inamdar
First published:

Tags: Krishnashtami, Mumbai, Sri Krishna Janmashtami

ఉత్తమ కథలు