సన్ ఫ్లవర్ చాలా కలర్ఫుల్గా.. ఎంతో బ్యూటిఫుల్‌గా.. ఉంటుంది. సూర్యుడి ఎటూవైపు ఉంటే.. అటు తిరిగే పొద్దు తిరుగుడు పువ్వులు చాలా ప్రత్యేకమైనవి. మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు పొద్దు తిరుగుడు పొలం కనిపిస్తే వెంటనే ఆగిపోతాం. చేనులోకి వెళ్లి కాసేపు ఆ అందమైన పువ్వులతో ఫొటోలు దిగుతాం. అలాంటి పొద్దు తిరుగుడు చెట్లు ఎంత పొడువు ఉంటాయి? మహా అయితే ఐదారు ఫీట్ల వరకు ఉండొచ్చు. కానీ ఏకంగా ఇళ్లంత పొడవు ఉండి.. గొడుగు కంటే పెద్ద సైజులో పొద్దు తిరుగుడు పువ్వులు ఉంటే..ఎంతో అద్భుతంగా ఉంటుంది కదా.! వినడానికే ఎంతో బాగుంది.. అలాంటిది కళ్లారా చూస్తే.. ఆ థ్రిల్లింగే వేరు..! అలాంటి బాహుబలి పొద్దుతిరుగుడు పువ్వులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
రెడిట్ వెబ్సైట్లో ప్రామ్మామా అనే యూజర్ ఈ ఫొటోలను షేర్ చేసింది. పొద్దు తిరుగుడు మొక్కల పక్కనే యువతి నిలబడంతో.. ఆ పువ్వు ఆమెకు గొడుగు పట్టినట్లుగా కనిపించింది. మరో యువతి కూడా ఈ భారీగా చెట్ల వద్ద ఫొటోలు దిగింది. అవి ఏకంగా ఇళ్లంత పొడవు ఉన్నాయి. ఆ ఫొటోలను తమ ట్విటర్ ఖాతాలోనూ రెడిట్ పోస్ట్ చేసింది. వాటిని చూసిన నెటిజన్లు నోరెళ్ల పెడుతున్నారు. ఇవేంటి మరీ ఇంత పొడవు ఉన్నాయని ఆశ్చర్య పోతున్నారు.
వీటిని చూస్తుంటే భూమిపై కొత్త సూర్యుళ్లు పుట్టినట్లుగానే అనిపిస్తోందని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేశారు. ఇంతటి అద్భుతమైన పొద్దు తిరుగుడు పువ్వులను ఎక్కడా చూడాలేని.. చాలా బాగున్నాయంటూ అభిప్రాయపడుతున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:September 11, 2020, 07:30 IST