Home /News /trending /

HUMILIATED KARNATAKA FARMER REVENGE AFTER CAR SHOWROOM TURNED HIM RS 10 LAKH IN 30 MINUTES FOR SUV MKS

Farmer Revenge: కార్ల షోరూమ్‌లో రైతుకు ఘోర అవమానం.. తర్వాత ఏం చేశాడో తెలిస్తే షాకవుతారు!

రైతు కెంపెగౌడ

రైతు కెంపెగౌడ

మెగాస్టార్ చిరంజీవి డబుల్ రోల్ చేసిన ‘స్నేహం కోసం’ సినిమా గుర్తుండే ఉంటుంది. సినిమా ప్రారంభంలోనే చిన్న చిరంజీవి, తన యజమాని విజయ్ కుమార తో కలిసి ఆటోలో మూటతో కార్ల షోరూమ్ కు వెళ్లడం, వాళ్ల తీరుతెన్ను చూసి షోరూమ్ వాడు చిరును అవమానించడం, గోనె సంచిలో డబ్బులు కిందికి పోయగానే..

ఇంకా చదవండి ...
కారు కొనే ముఖమేనా నీది? నడు, పక్కకు తప్పుకో.. నీలాంటోళ్లను ఇక్కడ చూస్తే వచ్చే కస్టమర్లు కూడా తిరిగెళ్లిపోతారు.. అంటూ సేల్స్ మ్యాన్ నోటికొచ్చినట్లు వాగాడు. ఆ మాటలకు నొచ్చుకున్న రైతు ఆ ఘటనను అవమానంగా ఫీలయ్యాడు. అప్పటికప్పుడు ఫోన్లు చేసి అర గంటలో 10 లక్షలు పోగుచేసి షోరూం వాడి ముఖాన కొట్టి కొత్త కారును కొనుక్కున్నాడు. అంతటితో కథ ముగియలేదు.. కొత్త కారు బుక్ చేసి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి తనను అవమానించిన కార్ల షోరూమ్ పై కేసు పెట్టాడు. కర్ణాటకలోని తుముకూర్ లో చోటుచేసుకున్న ఈ ఘటన నెట్టింట వైరలైంది..

మెగాస్టార్ చిరంజీవి డబుల్ రోల్ చేసిన ‘స్నేహం కోసం’ సినిమా గుర్తుండే ఉంటుంది. సినిమా ప్రారంభంలోనే చిన్న చిరంజీవి, తన యజమాని విజయ్ కుమార తో కలిసి ఆటోలో మూటతో కార్ల షోరూమ్ కు వెళ్లడం, వాళ్ల తీరుతెన్ను చూసి షోరూమ్ వాడు చిరును అవమానించడం, గోనె సంచిలో డబ్బులు కిందికి పోయగానే సార్ క్షమించండంటూ వేడుకోవడం తెలిసిందే. సరిగ్గా ఇలాంటి సీనే కర్ణాటకలోని తుముకూర్​లో గల మహీంద్రా షోరూమ్​ లో చోటుచేసుకుంది.

Sexual Assault: 9ఏళ్ల బాలుడిపై ముగ్గురు టీనేజర్ల లైంగికదాడి.. పోర్న్ వీడియోలు చూపిస్తూ అలా చేయాలని..తుముకూర్ జిల్లాకే చెందిన కెంపెగౌడ అనే రైతు తన మిత్రులతో కలిసి బొలెరో పికప్​ ట్రక్కు షోరూమ్ కు వెళ్లాడు. లోపలకు వెళ్లిన క్రమంలో వారి వేషధారణపై సెటైర్ వేస్తూ అక్కడి సేల్స్​మ్యాన్​ అవమానకరంగా మాట్లాడాడు. అంతేకాదు.. కారు ధర 10 రూపాయలు అనుకుని వచ్చినట్లు ఉన్నారు.. ఇక బయలుదేరండి అంటూ మాట తూలాడు. కారు కొనేందుకు ఇంత మంది గుంపుగా వస్తారా? అనీ హేళనగా మాట్లాడాడు. ఈ సంఘటన మొత్తం అక్కడే ఉన్న ఒకరు రికార్డు చేశారు.

Hyderabad : వీడసలు మనిషేనా? -అర్ధరాత్రి వ్యాయామం వద్దురా అన్నందుకు కన్నతల్లిని దారుణంగా..సేల్స్ మ్యాన్ మాటలకు కెంపెగౌడకు చిర్రెత్తుకొచ్చింది. సేల్స్​మ్యాన్ ఒకరి కింద నౌకరి చేస్తున్నాడు కానీ.. రైతు తన పొలంతో తాను సాగు చేసుకుంటూ జమిందారీలా బ్రతకుతాడని, రైతులకు ఆత్మాభిమానం ఎక్కువని చెబుతూ అర గంటలో రూ.10 లక్షలు తీసుకొచ్చి వెంటనే కారు డెలివరీ చేయాలని షోరూమ్ సిబ్బందిని డిమాండ్​ చేశారు. రైతు నుంచి ఊహాతీతమైన రిప్లై రావడంతో షోరూమ్ సిబ్బంది అవాక్కయ్యారు. మూడు రోజుల్లో కారు డెలివరీ చేస్తామని రైతుకు, ఆయన స్నేహితులకు తెలిపారు. ఆ తర్వాత..

Parosmia : మీ పిల్లలు సరిగా తినడంలేదా?.. Post Covid లక్షణం పారోస్మియా కావొచ్చు..ఏం చేయాలంటే..


కొత్త కారును బుక్ చేసిన తర్వాత రైతు కెంపెగౌడ తన స్నేహితులతో కలిసి నేరుగా తుముకూర్​లోని తిలక్​నగర్​ పోలీస్​ స్టేషన్​కు వెళ్లి మహీంద్రా షోరూమ్​ సిబ్బందిపై ఫిర్యాదు చేశాడు. సేల్స్​మ్యాన్​, ఇతర ఉద్యోగులు తమ తప్పు తెలుసుకుని కెంపెగౌడకు బహిరంగా క్షమాపణలు చెప్పారు. రాతపూర్వక క్షమాపణ పత్రాన్ని అందించారు. అనంతరం ఇరువర్గాలతో మాట్లాడిన పోలీసులు.. వివాదానికి ముగింపు పలికారు.
Published by:Madhu Kota
First published:

Tags: Farmer, Karnataka, Mahindra and mahindra, VIRAL NEWS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు