టీవీలో ముస్లిం యాంకర్.. కళ్లు మూసుకున్న హిందూ నేత

టీవీలో ముస్లిం యాంకర్‌ను చూసి ఓ హిందూ నేత కళ్లు మూసుకున్నారు. ఆ న్యూస్ రీడర్‌ను చూడకుండా తన కళ్లకు చేతులు అడ్డు పెట్టుకున్నారు.

news18-telugu
Updated: August 2, 2019, 6:11 PM IST
టీవీలో ముస్లిం యాంకర్.. కళ్లు మూసుకున్న హిందూ నేత
ముస్లిం యాంకర్‌ను చూసి కళ్లుమూసుకున్న హమ్ హిందు నేత అజయ్ గౌతమ్ (Image Credits: News24/Twitter)
  • Share this:
జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేస్తే ఓ ముస్లిం వ్యక్తి దాన్ని డెలివరీ చేయడానికి వచ్చాడంటూ.. ఆ ఆర్డర్ క్యాన్సిల్ చేసిన విషయం గుర్తుంది కదా. ఇదే పెద్ద విచిత్రం అనుకుంటే.. అంతకంటే విచిత్రమైన ఘటన ఒకటి జరిగింది. టీవీలో ముస్లిం యాంకర్‌ను చూసి ఓ హిందూ నేత కళ్లు మూసుకున్నారు. ఆ న్యూస్ రీడర్‌ను చూడకుండా తన కళ్లకు చేతులు అడ్డు పెట్టుకున్నారు. టీవీ ప్రత్యక్ష ప్రసారంలో ఉండగానే ఇది జరిగింది. జొమాటో వివాదంపై న్యూస్‌24 ఛానల్ ఓ చర్చను చేపట్టింది. దానికి ‘హమ్ హిందు’ అనే సంస్థ వ్యవస్థాపకుడు అజయ్ గౌతమ్‌ను ఆహ్వానించింది. ఈ చర్చ జరిగిన తర్వాత మరింత సమాచారం ఇచ్చేందుకు ఓ యాంకర్ వచ్చాడు. ఆ యాంకర్ పేరు ఎండీ.ఖలీద్. ఆ యాంకర్ స్క్రీన్ మీద కనిపించిన వెంటనే అజయ్ గౌతమ్ తన రెండు చేతులను ముఖానికి అడ్డుపెట్టుకున్నారు.

ఈ ఘటనపై న్యూస్‌24టీవీ ఛానల్ ఎడిటర్ ఇన్ చీఫ్ అనురాధ ప్రసాద్ స్పందించారు. భవిష్యత్తులో అజయ్ గౌతమ్‌ను ఎలాంటి చర్చలకు ఆహ్వానించబోమంటూ ట్వీట్ చేశారు.బ్రిజేష్ కలప్పా లాంటి కొందరు హిందూ నేతలు కూడా ఈ ఘటనను ఖండించారు.

First published: August 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>