Video : సోఫా వెనక దాక్కున్న కొండచిలువ... ఏం చేసిందంటే...

Spot The Snake : ఆస్ట్రేలియాలోని ఆ లివింగ్ రూం చూడటానికి ఎంతో బాగుంది. ఇక సోఫా అయితే... వెళ్లి కూర్చోవాల్సిందే అనిపిస్తోంది. అలాంటిది ఆ సోఫా వెనక కొండ చిలువ ఉందని తెలిస్తే... షాకే. అది ఎలా వచ్చింది? ఏం చేసింది?

Krishna Kumar N | news18-telugu
Updated: July 27, 2019, 8:43 AM IST
Video : సోఫా వెనక దాక్కున్న కొండచిలువ... ఏం చేసిందంటే...
Image credit: Facebook
Krishna Kumar N | news18-telugu
Updated: July 27, 2019, 8:43 AM IST
ఆస్ట్రేలియాలోని ఆ ఫ్యామిలీకి ఊహించని షాక్ తగిలింది. తెల్లారే ఎండలో సేదతీరుదామని లివింగ్ రూంకి వెళ్తే... అక్కడ వాళ్ల కంటే ముందే తిష్టవేసిన కొండ చిలువ... సూర్యుడి కిరణాల వెచ్చదనాన్ని పొందుతూ హాయిగా ఉంది. కొండచిలువను చూడగానే వాళ్లంతా షాక్ అయ్యారు. అసలది అక్కడకు ఎలా వచ్చింది? ఇప్పుడది ఏం చేస్తుంది? మనం ఏం చెయ్యాలి? ఇలా కొన్ని క్షణాలు టెన్షన్ పడ్డారు. తర్వాత కూల్‌గా దగ్గర్లోనే ఉన్న సర్వీస్ సన్‌షైన్ కోస్ట్ స్నేక్ కాచర్స్‌కి కాల్ చేసి విషయం చెప్పారు. వాళ్లు వచ్చి... ఫ్యామిలీ సభ్యులను ఆ గదిలోకి రావద్దని చెప్పి... తాపీగా ఉన్న కొండచిలువను జాగ్రత్తగా పట్టుకున్నారు. తర్వాత దాన్ని ఓ సంచిలో వేసి... జాగ్రత్తగా తీసుకెళ్లి... ఓ చెట్టుపై వదిలేశారు. ఇలా గుడ్ మార్నింగ్ కాస్తా... స్నేక్ మార్నింగ్ అయ్యింది.

కొండచిలువ ఉన్న లివింగ్ రూంని ఫొటో తీశారు స్నేక్ కాచర్స్. ఆ ఫొటోలో పైథాన్ ఎక్కడుందో కనిపెట్టమని ఫేస్‌బుక్‌లో నెటిజన్లకు ఛాలెంచ్ విసిరారు. ఓ క్లూ కూడా ఇచ్చారు. ఉదయం పూట పాములు ఏం చేస్తాయి అని అడిగారు. పాము ఎక్కడుందో ఆన్సర్ కావాలంటే... రేపు చూడండి అని అన్నారు. నెటిజన్లు ఆ పోస్టుకి బాగానే స్పందించారు. చాలా మంది పక్కనున్న మొక్కల్లో ఉందన్నారు. ఇంకొంతమంది సోఫాలో నిద్రపోతోందని అన్నారు. ఇంకొంతమంది... ఎప్పుడో వెళ్లిపోయిందిగా అంటూ ఇష్టమొచ్చినట్లు కామెంట్లు పెట్టారు. కొంతమంది మాత్రం పాము కనిపించట్లేదని నిజం ఒప్పుకున్నారు. నెక్ట్స్ మార్నింగ్ పాముకి సంబంధించిన పూర్తి వీడియోను అప్‌లోడ్ చేసి సస్పెన్స్‌కి తెరదించారు స్నేక్ కాచర్స్.


ఇది కార్పెట్ జాతి కొండ చిలువ అంట. ఇలాంటివి రెగ్యులర్‌గా కనిపిస్తాయంటున్నారు. ఇవి జనాన్ని చూసినా భయపడవనీ, మిగతా జాతుల పాములు మాత్రం జనాన్ని చూడగానే ముడుచుకుపోతాని చెబుతున్నారు.

First published: July 27, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...