Fight in flight over window seat: కొద్దినెలలుగా విమానాల్లో జరుగుతున్న కొన్ని సంఘటనలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి ప్రజలను కలవరపెడుతున్నాయి,ఆశ్చర్యపరుస్తున్నాయి. విమానాల్లో(Flight) ఇటీవల ప్రయాణికుల అనుచిత ప్రవర్తన శ్రుతి మించుతుంది. తాజాగా అలాంటిదే మరో ఘటన జరిగింది. సాధారణంగా మనం..కిటికీ పక్క సీటు కోసం ప్రయాణికులు రైళ్లు, బస్సుల్లో తిట్టుకోవడం, కొట్టుకోవడం చూసే ఉంటాం. అయితే ఇప్పుడు విండో సీటు కోసం ఏకంగా విమానంలోనే ప్రయాణికులు కొట్టుకున్నారు. ఫలితంగా రెండు గంటలపాటు విమానం ఆగిపోయింది. ఈ ఘటన బ్రెజిల్‌లోని గోల్ ఎయిర్‌లైన్స్ విమానంలో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోను మైక్ సింగ్‌టన్ అనే నెటిజన్ తన ట్విటర్ అకౌంట్ లో షేర్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
స్థానిక మీడియా కథనం ప్రకారం గోల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన సాల్వడార్-కాంగోన్‌హాస్ విమానం లో రెండు కుటుంబాలకు చెందిన 15 మంది ప్రయాణిస్తున్నారు. ఫ్లైట్ బయలుదేరడానికి కొన్ని క్షణాల ముందు ఒక మహిళా ప్రయాణికురాలు దివ్యాంగుడైన తన కుమారుడి కోసం విండో సీటు అర్థించగా ఆ సీటులో కూర్చున్న సహ ప్రయాణికుడు నిరాకరించాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన మహిళ..విండో సీటులో కూర్చున్న వ్యక్తిని ఏదో తిట్టింది. ప్రయాణికుడి కుటుంబంపై విరుచుకుపడింది. దీంతో ఇరువురి మాటల యుద్ధం మొదలై అది చివరకు ఘర్షణకు దారితీసింది. రెండు గ్రూపులుగా విడిపోయిన రెండు కుటుంబాలకు చెందిన 15 మంది విమానంలోనే చితక్కొట్టేసుకున్నారు. వీరిలో ఎక్కువమంది మహిళలే కావడం గమనార్హం. విమానం మధ్య వరుసలో మహిళలు ఒకరిపై ఒకరు అరుస్తూ దాడులు చేసుకుంటూ అరాచకం సృష్టించారు. వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది, విమాన కెప్టెన్ జోక్యం చేసుకుని వారించే ప్రయత్నం చేశారు. తాను దాదాపు విమానం తలుపులు మూసివేయబోతున్న సమయంలో గొడవ జరిగిందని విమాన సిబ్బంది ఒకరు తెలిపారు.
Massive brawl breaks out on airline flight to Brazil… over a window seat. pic.twitter.com/zTMZPYzzDy
— Mike Sington (@MikeSington) February 3, 2023
అదృష్టం అంటే ఇదేనేమో బ్రో..ముగ్గురు కవల అక్కాచెల్లెళ్లతో యువకుడి పెళ్లి..కాపురానికి టైమ్ టేబుల్ రెడీ
పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో భద్రతా సిబ్బంది సాయంతో మొత్తం 15 మంది ప్రయాణికులను విమానంలోనుంచి కిందకు దింపేసి రెండు గంటలు ఆలస్యంగా విమానం గమ్యస్థానానాకి బయల్దేరింది. ఈ సంఘటనను ఎయిర్‌లైన్స్ కూడా ధ్రువీకరించింది. అయితే విమానంలో ప్రయాణికుల మధ్య గొడవను ఫోన్ లో రికార్డ్ చేసిన ఓ ప్రయాణికుడు దానిని సోషల్ మీడియాలో పోస్టు చేయగా ఆ వీడియో వైరల్ గా మారింది. ఇదెక్కడి గోల రా బాబు..విమానంలో కూడా తయారయ్యారా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. . 2021లోనూ ఇలాంటి ఘటనే ఒకటి అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో జరిగింది. సీటు కోసం మొదలైన గొడవలో ఇద్దరు వ్యక్తులు గొడవ పడి కొట్టుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Brazil, Fighting, Flight, Viral Video