హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

రోడ్లపై అడ్డమైన స్టంట్ లు వేస్తే.. ఇది గో ఇలా ... వీడియో షేర్ చేసిన ట్రాఫిక్ పోలీసులు..

రోడ్లపై అడ్డమైన స్టంట్ లు వేస్తే.. ఇది గో ఇలా ... వీడియో షేర్ చేసిన ట్రాఫిక్ పోలీసులు..

స్టంట్ లు వేస్తున్న కుర్రాడు

స్టంట్ లు వేస్తున్న కుర్రాడు

Viral video: యువకుడు రోడ్డు మీద స్పోర్ట్స్ బైక్ మీద రయ్ అంటూ దూసుకెళ్తున్నాడు. చుట్టుపక్కల వాహానాలు ఉన్న విషయం కూడా మరిచిపోయి.. పాటలు పాడుకుంటూ డ్రైవింగ్ చేస్తున్నాడు.

చేతిలో బైక్ ఉంటే చాలు కొంత మంది యువత అసలు ఆగరు. రోడ్లపై రయ్ అంటూ దూసుకుపోతుంటారు. అడ్డమైన ఫీట్లు, స్టంట్ లు వేసుకుంటూ వెహికిల్ ను నడిపిస్తారు. అంతే కాకుండా.. రోడ్లపై నచ్చినట్లు డ్రైవింగ్ చేస్తుంటారు. మరికొందరు  రేసింగ్ లు చేస్తుంటారు. దీనికోసం స్పోర్ట్స్ బైక్ లను ఉపయోగిస్తుంటారు. అయితే.. కొన్నిసార్లు.. వీటి వలన అనేక ప్రమాదాలు జరుగుతాయి. మరికొన్నిసార్లు.. వెహికిల్స్ అడ్డదిడ్డంగా నడిపించడం వలన,  ప్రాణాలు పోయిన ఘటనలు కూడా వార్తలలో నిలిచాయి.  అనేక మంది .. వాహనాలను అడ్డదిడ్డంగా నడిపి తమ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. అయితే.. ఢిల్లీ పోలీసులు ఒక యువకుడి డెంజరస్ బైక్ స్టంట్ ను సోషల్ మీడియాలో (Social media)  షేర్ చేశారు. ఇది వైరల్ గా (viral video) మారింది.

పూర్తి వివరాలు.. టీనేజ్ యువకుడు బైక్ ను అడ్డదిడ్డంగా డ్రైవింగ్ నడిపిస్తున్నాడు. అతను తన బైక్ ను స్పీడ్ గా పోనిస్తున్నాడు. రోడ్డుమీద అనేక వాహనాలు వెళ్తున్నాయి. అయితే.. ఇంతలో షాకింగ్ ఘటన జరిగింది. బైకర్.. స్పీడ్ గా వెళ్తుండగా బ్యాలెన్స్ అవుట్ అయ్యింది. అప్పుడు.. అతను ఎగిరి కిందపడ్డాడు. అతను పడిన వేగానికి టూవీలర్  ముందు వైపుకు దూసుకు పోయింది.


అతను రోడ్డుపై బొర్లుకుంటూ వెళ్లి మరోవైపున పడ్డాడు. ఈ ఘటన అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఇది గతంలో జరిగింది. తాజాగా, ఢిల్లీ పోలీసులు (Delhi traffic police)  మరోసారి తమ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ లో షేర్ చేశారు. అది కాస్త వైరల్ గా మారింది. దీనిపై అధికారులు.. అడ్డదిడ్డంగా వెహికిల్ నడిపి.. కింద పడితే.. తిరిగి అతికించడానికి ఎవరు దొరకరంటూ ఘాటుగా కామెంట్ చేశారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Delhi, Viral Video

ఉత్తమ కథలు