Chicken Recipe : చికెన్ గ్రేవీ రెసిపీ... ఈ టైంలో తినాల్సిన కర్రీ ఇదే...

Chicken Gravy Recipe : కొద్దిగా టైమ్ పట్టినా... అద్భుతమైన టేస్టుతో చక్కటి గ్రేవీతో తయారయ్యే ఈ కర్రీ మీకు బాగా నచ్చుతుంది. తయారీ తెలుసుకుందామా.

news18-telugu
Updated: July 26, 2020, 3:43 AM IST
Chicken Recipe : చికెన్ గ్రేవీ రెసిపీ... ఈ టైంలో తినాల్సిన కర్రీ ఇదే...
Chicken Recipe : చికెన్ గ్రేవీ రెసిపీ... ఈ టైంలో తినాల్సిన కర్రీ ఇదే... (credit - twitter)
  • Share this:
Chicken Gravy Recipe : చికెన్ అంటే మాంసం. అందులో ప్రోటీన్స్ ఉంటాయి. అవి మన వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. ఐతే... ఎప్పుడూ రొటీన్‌గా చికెన్ కర్రీయో, ఫ్రై చికెనో వండుకుంటే... రొటీన టేస్ట్ అవుతుంది. కాస్త కొత్తగా ట్రై చేస్తే... అదిరిపోయే కొత్త టేస్ట్ చూడవచ్చు. ప్లస్ మనకు ఓ కొత్త వంట చేయడం కూడా వచ్చేస్తుంది. ఎప్పుడైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వాళ్లకు అలా చేసి పెడితే... వావ్ సూపర్ అంటూ లొట్టలేసుకు తింటారు. అలాంటి ఓ చక్కటి, అదిరిపోయే గ్రేవీతో చికెన్ కర్రీని ఎలా వండాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికి ఐటెమ్స్ ప్రిపేర్ చేసుకోవాడనికి 10 నిమిషాలు, వంట చేయడానికి 30 నిమిషాలు పడుతుంది.

Chicken Gravy Recipe : కావాల్సినవి :

500 గ్రాముల చికెన్
4 టేబుల్ స్పూన్ల నూనె
1 టీస్పూన్ జీలకర్ర
1 దాల్చిన చెక్క ముక్క లేదా పొడి
2 యాలకులు2 పెద్ద ఉల్లిపాయలు (ముక్కలుచేసి పెట్టుకోవాలి)
2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్
2 టమాటాలు (సన్నగా తరిగిపెట్టుకోవాలి)
2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి
2 టీస్పూన్ల కారం
1 టీస్పూన్ జీర పొడి
1 టీస్పూన్ గరం మసాలా పౌడర్
ఉప్పు సరిపడా

రోస్ట్ చేసి, గ్రైండ్ చేసుకోవాల్సినవి : (వీటిని పొడిలా చేసుకోవాలి)
1 టీస్పూన్ సోంపు
2 టీస్పూన్ల నల్ల మిరియాలు

Chicken Gravy Recipe : తయారీ విధానం :
- ముందుగా మిరియాలు, సోంపు గింజల్ని వేపాలి. అవి చల్లబడ్డాక, గ్రైండ్ చేసి, పొడిలా చేసుకోవాలి.
- ఇప్పుడు ప్రెషర్ కుక్కర్‌లో నూనె వేసి వేడి చెయ్యాలి. అందులో దాల్చిన చెక్క, జీలకర్ర, యాలకులు వెయ్యాలి. వేగనివ్వాలి.
- బుడగలు వస్తున్నప్పుడు, టప్ టప్ మని జీలకర్ర అంటున్నప్పుడు వెంటనే... ఉల్లిపాయలు వెయ్యాలి. బంగారు, గోధుమ రంగులోకి వచ్చే వరకు వేపాలి. వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి.
- ఇప్పుడు టమాటాలు వేసి... అవి గుజ్జులా మారేవరకూ కదుపుతూ వేపుతూ ఉండాలి.
- ఉప్పు, గరం మసాలా పౌడర్, ఇతరత్రా అన్నీ వేసేయాలి. ఐతే.. మిరియాల పొడి, సోంపు పొడి మాత్రం అప్పుడే వెయ్యకూడదు.
- ఇప్పుడు చికెన్ వేసి... బాగా కలపాలి.
- ప్రెషర్ కుక్కర్ మూసేసి... నాలుగైదు, విజిల్స్ వచ్చేవరకూ వండాలి. తర్వాత సిమ్‌లో పెట్టి 5 నిమిషాలు ఉంచాలి. తర్వాత మంట ఆర్పేసి, ఆవిరి పోయేలా అలా వదిలేయాలి.
- ఆవిరి పోయాక... కుక్కర్ తెరిచి... నీరు పొయ్యాలి. చికెన్ కావాల్సినంతగా ఉడికేలా చెయ్యాలి. ఇప్పుడు చివరలో మిరియాల పొడి, సోంపు పొడి వెయ్యాలి. ఇవి ఆప్షన్ మాత్రమే. వెయ్యకపోయినా పర్వాలేదు. వేస్తే మాత్రం బాగా కలిపి... వేడివేడిగా వడ్డించేయడమే.

ఈ గ్రేవీ చికెన్ కర్రీ... అన్నంతోపాటూ... రోటీ, పులావ్‌లోకి కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ అదిరిపోతుంది. నోరు ఊరుతూ ఉంటుంది. పుల్లపుల్లగా, స్పైసీగా భలే ఉందే అనిపిస్తుంది.
Published by: Krishna Kumar N
First published: July 26, 2020, 3:39 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading