Video : కోడిపై హిప్నాటిజం... గీత గీస్తే పడి ఉంటుందంతే... సీక్రెట్ ఇదీ...

Chicken Hypnotize : కొన్ని విషయాలు మనం అస్సలు నమ్మలేం. ఇది అలాంటిదే. కోడిపుంజు ముందు గీత గీస్తే... ఇక అది అక్కడే ఉంటుంది. ఇంచు కూడా కదలదు. ఎందుకో తెలుసుకుందాం.

Krishna Kumar N | news18-telugu
Updated: August 4, 2019, 10:23 AM IST
Video : కోడిపై హిప్నాటిజం... గీత గీస్తే పడి ఉంటుందంతే... సీక్రెట్ ఇదీ...
కోడిపై హిప్నాటిజం (Image : Youtube - Roostie Tooster)
  • Share this:
కోడిపుంజు మనకు దొరకడమే కష్టం. పట్టుకుందామంటే పారిపోతుంది. అలాంటి కోడిని కదలకుండా ఒకే చోట ఎంతసేపైనా కూర్చోబెట్టవచ్చు. అందుకోసం మనం చెయ్యాల్సిందల్లా... దాన్ని ఎక్కడైనా నేలపై కూర్చోబెట్టాలి. దాని తలను పట్టుకొని... కరెక్టుగా నేలపై దాని ముక్కు దాదాపు తగిలేలా సెట్ చెయ్యాలి. ఆ తర్వాత... మరో వ్యక్తి ద్వారా... ఆ ముక్కు దగ్గర నుంచీ అతని వేలితోగానీ, కర్రతోగానీ ఓ తిన్నటి గీత (స్ట్రైట్ లైన్) గీయాలి. అంతే... ఆ కోడి... ఆ గీతవైపే చూస్తూ... అలా ఉండిపోతుంది. ఆ సమయంలో మీరు ఆ కోడిని కదిపినా అది పట్టించుకోదు. దాని చుట్టూ ఏం జరుగుతున్నా, అది ఏమాత్రం స్పందించదు. అలా శవంలా ఉండిపోతుందంతే. ఇలా ఎంతసేపైనా అది గీతవైపు చూస్తూనే ఉంటుంది. కానీ... ఒక్కసారి మీరు గీత చెరిపారో... అంతే... మరు క్షణంలో అది అక్కడి నుంచీ పారిపోతుంది. కండీషన్ ఏంటంటే గీతను పూర్తిగా చెరపాలి. సగం చెరిపితే సరిపోదు. అదెలాగో ఈ వీడియో చూడండి.

పై వీడియో చూసినప్పుడు... ఇది నిజం కాదు అని మీకు అనిపించవచ్చు. కానీ ఇది 100 శాతం నిజం. దీన్నే కోడి వశీకరణం అంటారు. మనుషులపై ఎలా హిప్నాటిజం పనిచేస్తుందో, అలాగే కోళ్లపై కూడా పనిచేస్తుంది. దాదాపు 15 సెకండ్ల నుంచీ 30 నిమిషాల వరకు కూడా కోళ్లు ఇలా హిప్నాటిజంలో ఉండిపోగలవు. దీనికి కారణం ఒకటే. కోడిని అలా పట్టుకొని... బలవంతంగా దాని తలను నేలపై పెడుతున్నప్పుడు అది చాలా భయపడుతుంది. ఆ సమయంలో దానికి సెమీ పెరాలసిస్ (తాత్కాలిక పక్షవాతం) వస్తుంది. అదే సమయంలో గీత గీసినప్పుడు... తనకు ఏదో జరిగిపోతోందని కోడి భావిస్తుంది. అందువల్ల తనను తాను రక్షించుకునేందుకు కోడి అలా కదలకుండా ఉండిపోతుంది. అందువల్ల మనం లేదా ఏ ఇతర జంతువైనా అది చనిపోయిందని భావిస్తాయనీ, అందువల్ల దాన్ని తినకుండా వదిలేస్తాయనీ కోడి ఫీలింగ్. అదో రకం రక్షణ తంత్రం. గీత చెరిపేస్తున్నప్పుడు... కోడి ఏమనుకుంటుందంటే... తాను చనిపోయినట్లు నటిస్తున్నా... తనను వదిలేలా లేరనీ... ఎలాగైనా తప్పించుకోవాలనీ భావిస్తుంది. గీత పూర్తిగా చెరిపెయ్యగానే... అది పారిపోయేందుకు గట్టిగా ప్రయత్నిస్తుంది. దాంతో దాని తాత్కాలిక పక్షవాతం పోతుంది. వెంటనే అది పారిపోతుంది. అదీ సీక్రెట్.


1646లో మొదటిసారిగా ఇలాంటి ట్రిక్ ప్లే చేసి చూశారు. రోమ్‌లో అథనాసియస్ కిర్చెర్ ఇలా చేసినప్పుడు సక్సెస్ అయ్యాడు. మీకు ఇంకో విషయం చెప్పనా. చందమామ సినిమా చూశారా. అందులోని ఓ సీన్‌లో నవదీప్... కోడిని అటూ ఇటూ ఊపి... నేలపై పెట్టినప్పుడు అది అలాగే ఉంటుంది కదా. అది నిజమే. అదో రకం హిప్నాటిజం. ఇందుకోసం కోడిని చక్కగా పట్టుకొని... దాని తలను... ఓ రెక్క కిందకు పోనివ్వాలి. తర్వాత కోడిని కాసేపు అటూ ఇటూ ఊపాలి. వెంటనే కోడిని నెమ్మదిగా నేలపై ఉంచాలి. అప్పుడు కోడి 30 సెకండ్ల పాటూ కదలకుండా అలాగే ఉండిపోతుంది. అదెలాగో ఈ వీడియోలో చూడొచ్చు.ప్రపంచంలో జరిపిన వివిధ పరిశోధనల్లో కోడి మాగ్జిమం హిప్నాటిజంలో 3 గంటల 47 నిమిషాలు ఉండగలదని తేలింది. అంతకంటే ఎక్కువ సేపు ఇంతవరకూ ఏ కోడీ ఉండలేదు మరి.
First published: August 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు