Home /News /trending /

HOW TO EASILY SPLIT YOUR BILL WITH FRIENDS AND FAMILY USING GOOGLE PAY PAYTM A STEP BY STEP GUIDE GH VB

Split Bill Feature: గూగుల్​పే, పేటీఎంతో బిల్ ను.. ఇలా మీ స్నేహితులతో కలిసి పే చేయండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పాపులర్ ఆన్​లైన్ పేమెంట్ ప్లాట్​ఫామ్స్ పేటీఎం, గూగుల్ పే ఓ కొత్త ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చాయి. ఈ ఫీచర్​ ద్వారా మీ కాంటాక్ట్​ లిస్ట్​లోని స్నేహితులు, కుటుంబ సభ్యులకు బిల్లును విభజించి సులభంగా పేమెంట్​ చేయవచ్చు.

భారతదేశంలో డిజిటల్ పేమెంట్ వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోంది. కరోనా తర్వాత అంతా డిజిటల్ లేదా క్యాష్ లెస్ పేమెంట్లకే మొగ్గు చూపుతున్నారు. దీంతో, పాపులర్ ఆన్​లైన్ పేమెంట్ ప్లాట్​ఫామ్స్ పేటీఎం, గూగుల్ పే ఓ కొత్త ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చాయి. ఈ ఫీచర్​ ద్వారా మీ కాంటాక్ట్​ లిస్ట్​లోని స్నేహితులు, కుటుంబ సభ్యులకు బిల్లును విభజించి సులభంగా పేమెంట్​ చేయవచ్చు. ప్రతి వ్యక్తికి ఎంత చెల్లించాలని మాన్యువల్‌గా లెక్కించాల్సిన అవసరాన్ని ఈ ఫీచర్​ తొలగిస్తుంది. కొత్త ఫీచర్​ ద్వారా గూగుల్ పే, పేటీఎంలో స్నేహితులు, కుటుంబ సభ్యులతో సులభంగా బిల్లును ఎలా విభజించాలో చూద్దాం.

PPF Account: పోస్టాఫీసులో పీపీఎఫ్​ అకౌంట్ ఓపెన్​ చేయాలా.. అయితే ఆన్​లైన్​లో ఈ స్టెప్స్​ ఫాలో అవ్వండి..


గూగుల్ పే...
గూగుల్ పేని ఓపెన్ చేసి మెయిన్ పేజీలో ఉన్న ‘న్యూ పేమెంట్’ ఆప్షన్​పై క్లిక్ చేయండి. ఆ తర్వాత కొత్త స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఈ స్క్రీన్‌పై ‘ట్రాన్స్‌ఫర్ మనీ’ ట్యాబ్ కింద ఉన్న ‘న్యూ గ్రూప్’ ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్​పై క్లిక్ చేసిన తర్వాత కాంటాక్ట్స్ పేర్లతో కొత్త స్క్రీన్ ఓపెన్​ అవుతుంది. మీ ఇటీవలి గూగుల్​పే కాంటాక్ట్స్‌ లిస్ట్​ను ఇక్కడ చూడవచ్చు. లిస్ట్​లో నుంచి మీరు బిల్లును విభజించాలనుకుంటున్న కాంటాక్ట్​లపై నొక్కండి. తర్వాత స్క్రీన్​లో మీ గ్రూప్​కు పేరు పెట్టండి. అలాగే గ్రూప్​ను క్రియేట్ చేయండి.

ఆ తర్వాత, కింది భాగంలో కనిపించే ‘స్ప్లిట్ యాన్ ఎక్స్‌పెన్స్’ బటన్‌పై క్లిక్ చేయండి. గ్రూప్ సభ్యుల మధ్య విభజించాల్సిన మొత్తాన్ని నమోదు చేయండి. ఈ తర్వాత, మొత్తాన్ని సమానంగా విభజించండి. లేదా నిర్దిష్ట వినియోగదారుడికి చెల్లించాల్సిన మొత్తాన్ని నమోదు చేయవచ్చు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత 'సెండ్ రిక్వెస్ట్’ బటన్‌ను నొక్కండి. మీ పేమెంట్ ప్రోగ్రెస్‌ని గ్రూప్ మెయిన్ స్క్రీన్ నుండి ట్రాక్ చేయవచ్చు.

Retirement Plan: ఈ రిటైర్మెంట్ ప్లాన్‌తో డబ్బులే డబ్బులు.. పూర్తి వివరాలు తెలుసుకోండి..


పేటీఎం..
పేటీఎం పేమెంట్లను విభజించడానికి పేటీఎం యాప్‌ని ఓపెన్ చేసి, యూజర్ కన్వర్జేషన్ పేజీని కుడివైపుకి స్వైప్ చేయండి. కింద ఉన్న రెండు ఆప్షన్లలో స్ప్లిట్ బిల్​ ఆప్షన్​ను ఎంచుకోండి. ఇక్కడ మీరు విభజించాల్సిన మొత్తాన్ని ఎంటర్​ చేయండి. ఆ తర్వాత మీరు బిల్లును విభజించాలనుకుంటున్న కాంటాక్ట్​లను ఎంచుకోండి.

తర్వాతి పేజీలో మీరు ఆటో స్ల్పిట్ ఈక్వల్​ ఆప్షన్​ను ఎంపిక చేసుకోండి. ఇక్కడ ఏ కాంటాక్ట్​కు ఎంత చెల్లించాలో మాన్యువల్​గా ఎంచుకోండి. ఆ తర్వాత మీరు అభ్యర్థనను పంపవచ్చు. మెయిన్ పేజీలోని మొత్తంపై క్లిక్ చేయడం ద్వారా ఏ సభ్యుడు ఎంత చెల్లించారు? అనేది సులభంగా తెలుసుకోవచ్చు.
Published by:Veera Babu
First published:

Tags: Google pay, PhonePe

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు