• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • HOW THE SUPER BLOOD WOLF MOON 2019 WILL AFFECT PREGNANT WOMEN SB

గర్భిణీలు ఈ చంద్రగ్రహణం చూడకూడదా?

గర్భిణీలు  ఈ చంద్రగ్రహణం చూడకూడదా?

ప్రతీకాత్మక చిత్రం

ఈ గ్రహణ నియమాలపై చాలా మందిలో భయాలున్నాయి. గ్రహణ నియమాలు కచ్చితంగా పాటిస్తేనే ఫలితాలు బాగుంటాయని, లేకపోతే అరిష్టాలు జరుగుతాయని ప్రజలు నమ్ముతారు. అందుకే గ్రహణం ఏర్పడినప్పుడు హిందువుల ఇళ్లలో కచ్చితంగా ఈ నియమాలను పాటిస్తారు.

  • Share this:
    భారత కాలమానం ప్రకారం జనవరి 21న అంటే ఈరోజు మరికాసేపట్లో చంద్ర గ్రహణం ఏర్పడుతోంది. ఈ చంద్రగ్రహణాన్ని సూపర్ బ్లడ్ వూల్ఫ్ మూన్‌గా పిలుస్తున్నారు. అయితే గ్రహణాలకు.. హిందూ శాస్త్రాల్లో అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఏ గ్రహణం ఏర్పడిన అనేక నియమాలు, నిబద్ధతలు పాటించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. గ్రహణ సమయంలో ఆహారం తీసుకోకూడదని, కొన్ని రాశులు, నక్షత్రాల వారు గ్రహణం చూడరాదని చెబుతుంటారు పండితులు. గ్రహణం విడిచిన వెంటనే ఇల్లంతా శుభ్రం చేసుకుని, తలంటు స్నానం ఆచరించి ఇష్టదైవాన్ని ప్రార్థించాలంటారు. ఒకటి కాదు... ఇలా చాలా నియమాలే ఉన్నాయి. ఈ గ్రహణ నియమాలపై చాలా మందిలో భయాలున్నాయి. గ్రహణ నియమాలు కచ్చితంగా పాటిస్తేనే ఫలితాలు బాగుంటాయని, లేకపోతే అరిష్టాలు జరుగుతాయని ప్రజలు నమ్ముతారు. అందుకే గ్రహణం ఏర్పడినప్పుడు హిందువుల ఇళ్లలో కచ్చితంగా ఈ నియమాలను పాటిస్తారు.

    అంతేకాదు మరీ ముఖ్యంగా ... గర్భిణి స్త్రీలు అటూఇటూ కదలకుండా స్థిరంగా ఒకచోట ఉండాలంటారు. గర్భిణి స్త్రీ గ్రహణం సమయంలో బయటకు వెళ్లకూడదంటున్నారు. ఈసారి వస్తున్న చంద్రగ్రహాణాన్ని గర్భిణీలు చూడకూడదని చెబుతున్నారు ఆధ్యాత్మిక వేత్తలు. కడుపులో ఉన్న బిడ్డపై చంద్రుని కిరణాలు పడకుండా చూసుకోవాలనుకుంటున్నారు. దీంతో గ్రహణానికి ముందే గర్భిణీలు నిద్రకు ఉపక్రమించడం మంచిదని సలహా ఇస్తున్నారు. గ్రహణం విడిచిన తర్వాత కూడా తలంటు స్నానం చేసి ఇంట్లో పూజ చేయాలని చెబుతున్నారు.

    మరోవైపు సూపర్ బ్లడ్ వూల్ఫ్ మూన్‌గా పిలుస్తోన్న ఈ గ్రహణం భారత్‌లో కనిపించదంటున్నారు కొందరు. దీంతో భారత్‌లో ఉన్నవారు గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. శాస్త్రీయపరమైన జాగ్రత్తలు తీసుకోవడం అనవసరం. ముఖ్యంగా గర్భిణీలు ఈ చంద్రగ్రహణం గురించి అస్సలు భయపడవద్దని సూచిస్తున్నారు.

    ఇవికూడా చదవండి:

    నేడు సంపూర్ణ "తోడేలు" చంద్ర గ్రహణం... ప్రత్యేకతలేంటి? తోడేలు కథేంటి?

    Photos : చంద్రగ్రహణం ఎక్కడెక్కడ ఎలా కనిపించిందో చూడండి..

    First published: