ఈ ఫొటోలో కుక్క ఎక్కడుంది?.. ఓనర్ కనిపెట్టడానికే పది నిమిషాలు పట్టింది..

ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి ఆఫ్ బీట్ ఫొటోలు వైరల్‌గా మారుతున్నాయి. నెటిజన్లు కూడా తమ ఉత్సాహం కొద్దీ ఇలాంటి వాటిని షేర్ చేస్తున్నారు.

news18-telugu
Updated: August 2, 2020, 4:13 PM IST
ఈ ఫొటోలో కుక్క ఎక్కడుంది?.. ఓనర్ కనిపెట్టడానికే పది నిమిషాలు పట్టింది..
(Image;Reddit.com)
  • Share this:
ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఓ ఫొటో వైరల్‌గా మారింది. ఓ బెడ్ మీద కుక్క ఉంటుంది. ఆ కుక్కని కనిపెట్టండంటూ పజిల్ ఫొటో దర్శనమిస్తోంది. ఓ బెడ్ మీద దుప్పట్లు, దిండ్లు అన్నీ చెల్లాచెదురుగా పడేసి ఉన్నాయి. అందులో ఓ కుక్క కూడా ఉంది. కుక్కను రూమ్‌లోవదిలి వెళ్లిన దాని యజమాని మళ్లీ వచ్చేసరికి కనిపించలేదు. ఆ తర్వాత వెతగ్గా వెతగ్గా ఆ కుక్క కనిపించింది. తన కుక్కను కనిపెట్టడానికి పది నిమషాలు పట్టిందంటూ ఓ యూజర్ ఫొటోను షేర్ చేసింది. రెడిట్ వెబ్‌సైట్‌లో ఈ అనుభవాన్ని పంచుకుంది సదరు కుక్క యజమాని. మీరు కూడా కనిపెట్టండంటూ ఫొటోను పోస్ట్ చేసింది. వాస్తవానికి మీరు అనుకున్నదానికంటే చాలా తక్కువ సమయంలోనే కనిపెట్టవచ్చని ఈ ఫొటోను చూసిన వారు చెబుతున్నారు. ఇంతకీ మీకు కుక్క కనిపించిందా. పది నిమిషాల కంటే తక్కువ సమయంలోనే కనిపెట్టారా. వెరీ గుడ్. అయితే, ఇప్పటికీ మీకు కనిపించకపోతే ఈ కింద ఫొటోలో సర్కిల్ చేసి ఉంది చూడండి.

మంచం మీద దిండు కింద ఉన్న కుక్క (Image;Reddit.com)


ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి ఆఫ్ బీట్ ఫొటోలు వైరల్‌గా మారుతున్నాయి. నెటిజన్లు కూడా తమ ఉత్సాహం కొద్దీ ఇలాంటి వాటిని షేర్ చేస్తున్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 2, 2020, 4:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading