Kerala floods:  షాకింగ్​ వీడియో.. వరద నీటిలో కొట్టుకుపోయిన ఇల్లు.. కేరళలో విధ్వంసం సృష్టిస్తున్న వరదలు

నీటిలో కొట్టుకుపోతున్న ఇల్లు (Photo : srinivasiyc/Twitter)

ముందకాయం ప్రాంతంలోని మణిమాల నదికి వరద నీరు పోటెత్తడంతో.. నది ఒడ్డున ఉన్న ఇల్లు (house) అందరూ చూస్తుండగానే నీటి (water)లో కొట్టుకుపోయింది. అయితే ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో (NO one in Home) ప్రమాదం తప్పినట్లయింది

 • Share this:


  కేరళ (Kerala)ను వర్షాలు (heavy rains) అతలాకుతులం చేస్తున్నాయి. వరుణుడి ప్రకోపానికి విలవిల్లాడుతుంది. ముఖ్యంగా కొట్టాయం, ఇడుక్కి జిల్లాలలో వరదల ధాటికి కొండ చరియలు విరిగిపడ్డాయి. ఫలితంగా ఇళ్లు ధ్వంసం అయ్యాయి. వరదల కారణంగా కేరళలో ఇప్పటి వరకు 22 మంది మరణించినట్లు తెలిసింది. కేరళలో వరద తీవ్రత ఎలా ఉందంటే ఏకంగా ఇళ్లే వరద నీటిలో కొట్టుకుపోతున్నాయి.

  కొట్టాయంలో..

  న‌ది పరివాహక ప్రాంతంలో వ‌ర‌ద ఉధృతి వ‌ల్ల ఆదివారం సాయంత్రం కొట్టాయం (Kottayam) జిల్లాలో.. ఓ ఇల్లు అమాంతం వ‌ర‌ద‌లో ప‌డి కొట్టుకుపోయింది. ముందకాయం ప్రాంతంలోని మణిమాల నదికి వరద నీరు పోటెత్తడంతో.. నది ఒడ్డున ఉన్న ఇల్లు (house) అందరూ చూస్తుండగానే నీటి (water)లో కొట్టుకుపోయింది. అయితే ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో (NO one in Home) ప్రమాదం తప్పినట్లయింది. ముప్పును ముందుగానే గుర్తించి వరద ప్రభావిత ప్రాంతాలలో ఉన్న వారిని తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ వీడియో (video) ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ఇల్లు న‌దిలో కొట్టుకుపోతున్న వీడియోను కాంగ్రెస్​ నాయకుడు శ్రీనివాస్​ బీవీ (srinivas BV) సోషల్ మీడియాలో పోస్టుచేశారు.

  కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో ఎడతెరిపిలేకుండా వర్షాలు (rains) కురుస్తున్నాయి. ఇంకా 48 గంటలపాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటివరకు కొట్టాయం జిల్లాలో 13 మంది మరణించగా.. ఇడుక్కి జిల్లాలో తొమ్మిది మంది, అలప్పుజ ప్రాంతంలో నలుగురు మరణించారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో సైన్యం, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ (NDRF), పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేపట్టిన సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. కాగా.. భారీ వర్షాల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) కేరళ సీఎం పి. విజయన్‌ (Vijayan)తో మాట్లాడారు. వరదల పరిస్థితి గురించి ప్రధాని మోదీ ఆరా తీశారు. కేంద్రం (center) నుంచి సహాయ సహకారాలు అందిస్తామని హామీ నిచ్చారు.  భారత్ (India) లో వర్షపాతం ఎక్కువగా రుతుపవనాల (monsoons) మూలంగానే సంభవిస్తుంది. ముఖ్యంగా నైరుతి రుతుపవనాల వల్ల దేశమంతటా విస్తారంగా వర్షాలు (Rains) కురుస్తాయి.ప్రతి ఏటా మొదటగా కేరళ (Kerala)ను తాకి అనంతరం దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు ఈ రుతుపవనాలు వ్యాపిస్తాయి. అనంతరం తిరుగుముఖం పడతాయి. అయితే, ఈ ఏడాది రుతుపవనాలు ఆలస్యంగా (late) తిరోగమించిన కారణంగా కేరళ రాష్ట్రంలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ఆ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు ఉప్పొంగుతున్నాయి.

  Read This also: వంట పాత్రలో పెళ్లి మండపానికి వెళ్లి పెళ్లి చేసుకున్న వధూవరులు.. ఎందుకో తెలుసా?


  భారత వాతావరణ శాఖ (IMD) అక్టోబరు 10న విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో తుఫాను కారణంగా అక్టోబరు 12 నుంచి 14 తేదీల్లో కేరళ, మాహేల్లో భారీగా వర్షాలు పడతాయని పేర్కొంది. ఇదే సమయంలో నైరుతి రుతుపవనాలు దేశంలోని వాయువ్య ప్రాంతాల నుంచి తిరుగుముఖం పట్టాయని తెలిపింది. ఫలితంగా కేరళలో ఆరు జిల్లాలకు ప్రమదా హెచ్చరికలు జారీ చేసింది. పతనంతిట్ట, కొట్టాయం, ఎర్నాకుళం, ఇడుక్కి, పాలక్కాడ్, త్రిస్సూర్, దక్షిణ, మధ్య కేరళ ప్రాంతం వర్షంతో దెబ్బతిన్నాయి


  Published by:Prabhakar Vaddi
  First published: