ట్రంప్‌కు ఊహించని షాక్.. అధికారాలకు కత్తెర..

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు అక్కడి పార్లమెంట్ ఊహించని షాక్ ఇచ్చింది. ఆయనకు ఉన్న కొన్ని అధికారాలకు కత్తెర వేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దాంతో ఆయన ఇరాన్‌పై యుద్ధం ప్రకటించే అధికారం కోల్పోయారు.

news18-telugu
Updated: January 10, 2020, 10:07 AM IST
ట్రంప్‌కు ఊహించని షాక్.. అధికారాలకు కత్తెర..
డోనాల్డ్ ట్రంప్ (Credit - Twitter - CNN Politics)
  • Share this:
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు అక్కడి పార్లమెంట్ ఊహించని షాక్ ఇచ్చింది. ఆయనకు ఉన్న కొన్ని అధికారాలకు కత్తెర వేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దాంతో ఆయన ఇరాన్‌పై యుద్ధం ప్రకటించే అధికారం కోల్పోయారు. వివరాల్లోకెళితే.. ఇరాన్‌పై యుద్ధం ప్రకటించడానికి అవసరమైన అధికారాలను అమెరికా అధ్యక్షుడికి తగ్గించాలని హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్‌లో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి 224 మంది ఆమోదం తెలపగా, 194 మంది వ్యతిరేకించారు. దీంతో ట్రంప్ ఇరాన్‌పై యుద్ధాన్ని ప్రకటించే అవకాశాన్ని కోల్పోయారు. ఆయనిప్పుడు ఏ నిర్ణయమూ సొంతంగా తీసుకోలేరు. ఈ తీర్మానానికి డెమోక్రాట్లతో పాటు పలువురు రిపబ్లికన్లు కూడా మద్దతివ్వడం గమనార్హం.

అయితే, ఇరాన్ ఆర్మీ చీఫ్ సులేమాన్‌ హత్యకు ట్రంప్ ఆదేశాలు ఇవ్వడమే కారణమని, ఆయన దూకుడును తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు దీన్ని బట్టి స్పష్టం అవుతోంది. ఈ నిర్ణయంతో ఇరాన్‌, అమెరికా మధ్య యుద్ధ వాతావరణం తొలగిపోయినట్లే. సులేమాన్ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించి, ఇరాన్ ప్రతి దాడులు చేసిన నేపథ్యంలో అమెరికా నిర్ణయాలపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే.. ఇప్పుడు యుద్ధం దాదాపు లేనట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా పార్లమెంట్ యుద్ధానికి ఆమోదం తెలిపితే తప్ప యుద్ధం రాదు.

First published: January 10, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు