OMG: నొయిడాలోని ఓ హోటల్ సిబ్బంది బల్లి పడిన ఆహారాన్ని కస్టమర్‌కి పంపారు. ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసిన కరోనా బాధితులు జొమాటో ఎగ్జిక్యూటివ్ ఇచ్చిన పార్శిల్ ఓపెన్ చేసి భోజనం తింటుండగా అందులో బల్లి కనిపించడంతో షాక్ అయ్యారు. హోటల్ సిబ్బంది నిర్లక్యంపై అధికారులకు ఫిర్యాదు చేశారు. హోటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోకపోవడంతో వీడియో వైరల్ అవుతోంది.
ఆ ఫ్యామిలీ కరోనా బారినపడింది. ఇంట్లో ఆహారం వండుకొని తినే పరిస్థితి లేకపోవడంతో ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ చేశారు భార్యభర్తలు. జొమాటో డెలవరీ ఎగ్జిక్యూటివ్ ఫుడ్ ప్యాక్ ఇచ్చి వెళ్లిపోయాడు. పార్శిల్ తెప్పించుకున్న జంట భోజనం తింటుండగా హోటల్ వాడు పంపిన కూరలో బల్లి (Lizard)వచ్చింది. భార్యభర్తలిద్దరు తినే ఆహారంలో బల్లిని చూసి షాక్ తిన్నారు. ఈ ఘటన గ్రేటర్ నొయిడా(Greater noida)లో జరిగింది. స్థానికంగా ఉంటున్న కౌస్తుబ్ సిన్హా అనే వ్యక్తితో పాటు అతని భార్యకు ఈ చేదు అనుభవం ఎదురైంది. కౌస్తుబ్ సిన్హా(Kaustubh sinha)తో పాటు ఆయన భార్య కరోనా పాజిటివ్ (Corona positive)రావడంతో హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. ఆహారాన్ని జొమాటో(Zomato)లో ఆర్డర్( Order)పెట్టుకొని తెప్పించుకొని తింటున్నారు. ఈక్రమంలోనే ఈనెల 14వ (14th january)తేదిన నోయిడా ఎక్స్‌టెన్షన్‌లోని చార్మూర్తి సర్కిల్ సమీపంలో ఉన్న పంజాబీ రసోయి హోటల్(Hotel punjabi rasoi)కి ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేశారు. జొమాటో డెలవరీ పర్సన్ తెచ్చి ఇచ్చిన భోజనం చేసిన తర్వాత చివర్లో బల్లి పడి ఉండటాన్ని గుర్తించారు కౌస్తుబ్సిన్హా అతని భార్య. అప్పటికే బల్లి పడిన ఆహారం తినేయడంతో భయంతో డాక్టర్‌కి ఫోన్ చేసి మందులు వాడారు. అసలే కరోనాతో బాధపడుతున్న తమకు ఇలాంటి భోజనం పంపుతారా అంటూ జొమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌తో పాటు రెస్టారెంట్‌కి ఫోన్ చేశారు. ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ పార్శిల్లో వచ్చిన బల్లి దృశ్యాలను ఫోటో, వీడియో తీసి వాళ్లకు పంపారు.
భోజనంలో బల్లులు ఉంటాయి జాగ్రత్త..
బాధితుడు కౌస్తుబ్ సిన్హా తమకు జరిగిన అన్యాయం, చేదుఅనుభవంపై అటు జొమాటో సిబ్బంది, హోటల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు.అయినప్పటికి వాళ్లు డబ్బులు తిరిగి ఇవ్వకపోగా జరిగిన పొరపాటుపై ఏమాత్రం స్పందించలేదు. కనీసం జరిగిన పొరపాటును సరిదిద్దుకునే ప్రయత్నం కూడా చేయలేదు. దీంతో బాధితులు ఈనెల 16వ తేదిన బిస్రత్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అందరూ తినే ఆహారం విషయంలో హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తప్పుపడుతూ ఫుడ్ ఇన్స్పెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
నిర్లక్ష్యానికి నిదర్శనం..
ఇంత జరిగితే చనిపోయిన బల్లి పడ్డ ఆహారం పంపిన హోటల్ యాజమాన్యంపై కనీసం చర్యలు తీసుకోలేదు అధికారులు. ఎలాంటి కేసులు నమోదు చేయలేదని బాధితులు అసహనం వ్యక్తం చేశారు. ఆరోగ్యం బాగోలేదని ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసే వాళ్లు హోటల్ నుంచి వచ్చిన భోజనం రుచికరమైనదా కాదా అని తెలుసుకునే ముందు అందులో ఎలాంటి క్రిములు, కిటకాలు పడ్డాయో చూసుకోమని అందరికి సూచిస్తున్నారు కౌస్తుబ్ దంపతులు.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.