ఒంటికి వ్యాయామం మంచిదే. కాని మోతాదుకు మించి వర్కవుట్స్ చేసినా, వయసు ఎక్కువగా ఉన్నవాళ్లు, గుండె జబ్బు వంటి ఇతర సమస్యలతో బాధపడే వాళ్లు జిమ్‌లో ఒంటిని కష్టపెట్టవద్దని వైద్యులు సూచిస్తూనే ఉంటారు. కాని ఆరోగ్యంగా ఉండేందుకు చేస్తుండగానే ప్రాణాలు కోల్పోతున్నారు. మధ్యప్రదేశ్(Madhya pradesh) ఇండోర్(Indoor)లో ఓ యాభై ఏళ్లకుపైబడిన వ్యక్తి జిమ్(Gym)లో ఎక్సర్‌సైజ్(Exercise)లు చేసిన తర్వాత అక్కడ కుప్పకూలిపోయాడు. అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం సీసీ కెమెరాలో రికార్డైంది.
వీడియో వైరల్ ..
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ప్రాణం అన్నింటికంటే విలువైనది కాబట్టి దాన్ని కాపాడుకునేందుకు ఎక్సర్‌సైజులు, జిమ్‌లో ఫిట్‌నెస్ వర్కవుట్స్ చేసి శరీరాన్ని ధృడంగా ఉంచుకోవడం అందరికి అలవాటైపోయింది. ఈపరిణామం మంచిదే కాని ...వయసు పైబడుతున్న కొద్ది వ్యాయమం కొంత రిలాక్స్‌గా చేయడం మంచిది. మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని ఓ జిమ్‌లో ఓ హోటల్ యజమాని వర్కవుట్స్ చేస్తూనే కుప్పకూలిపోయాడు. నగరంలోని ప్రముఖ హోటల్ వ్యాపారి ప్రదీప్ రఘువంశీ 53ఏళ్ల వ్యక్తి విజయ్‌నగర్‌లోని గోల్డ్ జిమ్‌కు రెగ్యులర్‌గా వెళ్తూ ఉండేవాడు. గురువారం రోజున కూడా యధావిదిగా జిమ్‌కి వచ్చి ఉదయం 7గంటల సమయంలో ట్రెడ్‌మిల్‌పై జాగింగ్ చేశాడు. తాను వేసుకున్న జాకెట్ తీసేందుకు పక్కకు వస్తూనే కుప్పకూలిపోయాడు.
వ్యాయమం చేస్తూనే ..
జిమ్‌లో హోటల్ వ్యాపారి కళ్లు తిరిగి పడిపోయాడని జిమ్‌లోని వ్యక్తులతో పాటు నిర్వహకులు గమనించి వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రదీప్ రఘువంశీకి గుండెపోటుతో పడిపోయాడని ...ఆసుపత్రికి తీసుకొచ్చేలోపే ప్రాణం పోయిందని డాక్టర్లు తెలిపారు. జిమ్‌లో రికార్డైన సీసీ ఫుటేజ్ దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ప్రదీప్ రఘువంశీ నగరంలోని బృందావన్ హోటల్ మేనేజర్‌గా ఉన్నారు. మృతుడికి భార్య ఒక కొడుకు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద అమ్మాయికి జనవరి 17న వివాహం నిశ్చయించారు. మరో పది రోజులు ఉండగానే తండ్రి చనిపోయాడన్న వార్త ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది.
హార్ట్ పేషెంట్‌కి ఆగిన గుండె..
రఘువంశీ 15 ఏళ్ల క్రితం గుండె జబ్బుతో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. గత ఏడేళ్లుగా క్రమం తప్పకుండా జిమ్‌కి వెళ్తున్నాడు. ఈక్రమంలోనే ఈవిధంగా అర్దాంతరంగా గుండెపోటు రావడం ..ప్రాణాలు కోల్పోవడం అందర్ని బాధకు గురి చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Madhya pradesh, VIRAL NEWS, Viral Video