హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

ఫంక్షన్ హాల్‌లో పెళ్లి వేడుక.. బయట ఉండి కేకలు వేస్తున్న యువతి.. ఇంతకీ ఆమె ఎవరంటే.. Video

ఫంక్షన్ హాల్‌లో పెళ్లి వేడుక.. బయట ఉండి కేకలు వేస్తున్న యువతి.. ఇంతకీ ఆమె ఎవరంటే.. Video

ఫంక్షన్ హాల్ గేటు ముందు యువతి ఆందోళన

ఫంక్షన్ హాల్ గేటు ముందు యువతి ఆందోళన

ఓ ఫంక్షన్ హాల్‌లో పెళ్లి వేడుక ఘనంగా జరుగుతోంది. వేడుకకు అతిథులు అంతా చేరకున్నారు. అయితే ఫంక్షన్ హాల్ బయట ఓ యువతి కేకలు వేస్తూ కనిపించింది.

ఓ ఫంక్షన్ హాల్‌లో పెళ్లి వేడుక ఘనంగా జరుగుతోంది. వేడుకకు అతిథులు అంతా చేరకున్నారు. అయితే ఫంక్షన్ హాల్ బయట ఓ యువతి కేకలు వేస్తూ కనిపించింది. అయితే ఆమె పెళ్లి జరుగుతున్న చోటుకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. అక్కడున్న సెక్యూరిటీ గార్డులు ఆమెను అడ్డుకున్నారు. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆమెను విచారించగా.. ఆసక్తికర విషయాలను వెల్లడించింది. వివరాలు.. మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ జిల్లాలో గురువారం ఓ పెళ్లి వేడుక వద్ద హైడ్రామా చేసుకుంటుంది. పెళ్లి జరుగుతున్న ఫంక్షన్ హాల్ వద్దకు చేరుకున్న యువతి.. లోనికి వెళ్లేందుకు ప్రయత్నించింది.

అయితే సెక్యూరిటీ గార్డ్స్, ఇతరులు ఆమెను అడ్డుకున్నారు. దీంతో ఆమె లోపల ఉన్న ప్రియుడు కోసం కేకలు వేయసాగింది. సోనా బాబు, సోనా బాబు ఏడుస్తూ అరవడం మొదలుపెట్టింది. గేటు వద్ద నిల్చుని పెద్దగా అరవ సాగింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మహిళా ఎస్సై శ్రద్ధా రాజ్‌పుత్ అక్కడకు చేరుకుని.. ఆ యువతిని కారులో కూర్చొపెట్టి వివరాలు అడిగారు. దీంతో ఆమె పలు విషయాలను చెప్పుకొచ్చారు.

పెళ్లి చేసుకుంటున్న వ్యక్తి తనను ప్రేమించినట్టుగా ఆరోపించింది. అతడు తనతో మూడేళ్లు కలిసి సహజీవనం చేసినట్టు చెప్పుకొచ్చింది. ఇప్పుడు అతడి పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి ఇక్కడి వచ్చినట్టు తెలిపింది. దీంతో ఎస్సై.. ఫిర్యాదు చేస్తే, అతడిపై చర్యలు తీసుకుంటామని చెప్పింది. అయితే అందుకు యువతి నిరాకరించింది. కాసేపటికే తనతో వచ్చిన వారితో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయింది.

' isDesktop="true" id="949184" youtubeid="kVYlW3ECS5s" category="trending">

ఇక, కాన్పూర్‌కు చెందిన ఆ యువతి ఉద్యోగ నిమిత్తం భోపాల్‌లో నివాసం ఉంటుందని తెలుస్తోంది. అక్కడే పెళ్లి చేసుకుంటున్న యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడిందని, వారిద్దరు కలిసి జీవించినట్టుగా సమాచారం.

First published:

Tags: Madhya pradesh, Marriage, Viral Video

ఉత్తమ కథలు