Home /News /trending /

HORSE GETS SCARED OF CRACKER RUNS AWAY WITH GROOM SITTING ON TOP PAH

Viral video: వరుడిని ఎత్తుకెళ్లిన గుర్రం.. బంధువుల పరుగో పరుగు.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో..

బెదిరిపోయిన గుర్రం

బెదిరిపోయిన గుర్రం

Wedding video: పెళ్లి కొడుకు అందంగా ముస్తాబై గుర్రం మీద పెళ్లి మండపానికి చేరుకున్నాడు. వరుడికి వెల్ కమ్ చెప్పడానికి, వధువు తరపు వారు మండపం బయటకు వచ్చారు. అప్పుడు ఊహించని సంఘటన జరిగింది.

ప్రతి రోజు పెళ్లిళ్ల వీడియోలు (Wedding video)  నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి. పెళ్లి వేడుకలో జరిగే సరదా సన్నివేశాలు, ఫన్నీ సంఘటనల కారణంగా పెళ్లిళ్లు కాస్త వార్తలలో నిలుస్తున్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్లు ఒకప్పటిలా సింపుల్ గా జరగట్లేదు. నేటి యువత తమ పెళ్లి ట్రెండ్ కు తగ్గట్టుగా సెలబ్రేట్ చేసుకొవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీని కోసం వెడ్డింగ్ ఆర్గనైజర్స్ లను కూడా సంప్రదిస్తున్నారు. ఇక పెళ్లి వేదికకు కొత్త జంట వెరైటీగా ఎంట్రీ ఇస్తున్నారు.

కొన్ని చోట్ల వధువు బుల్లెట్ బండీ, ఎడ్లబండి, క్రేన్ లాంటి ఊయల, ఒపేన్ టాప్ కారు వెరైటీగా ఎంట్రీ ఇచ్చారు. ఇక పెళ్లిలో కొన్ని చోట్ల ఎమోషనల్ సంఘటనలు జరిగితే, మరికొన్ని చోట్ల ఫన్నీ సంఘటనలు జరిగాయి. కొన్ని పెళ్లిళ్లలో, వేదికపై కొత్త జంట కొట్టుకొవడం, మాజీ లవర్ ఎంట్రీ ఇవ్వడం, వరమాల వేసుకునేటప్పుడు కొట్టుకొవడం, బరాత్ లో గొడవలు పడటం వంటివి అనేక వీడియోలు గతంలో వైరల్ (Video viral)  అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ పెళ్ళిలో అనుకొని సంఘటన జరిగి అది కాస్త వైరల్ గా మారింది.










View this post on Instagram






A post shared by memes | comedy (@ghantaa)






పూర్తి వివరాలు.. పెళ్లివేడుకలో (Marriage) భాగంగా వరుడిని గుర్రం మీద బంధువులు, స్నేహితుల మధ్యలో ఊరేగింపుగా పెళ్లి మండపానికి తీసుకొని వచ్చారు. వరుడిని గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పడానికి వధువు తరపు వారు కల్యాణ మండపానికి బయట చేరుకున్నారు. వరుడికి బొట్టుపెట్టి, మంగళ ఆరతులు ఇచ్చారు. ఈ క్రమంలో.. కొంత మంది అక్కడ టపాసులు కాల్చారు. అప్పుడు ఊహించని సంఘటన జరిగింది. పాపం.. టపాసుల శబ్ధానికి గుర్రం (Horse riding)  బెదిరిపోయింది. వెంటనే అక్కడి నుంచి వరుడితో పాటే పరుగులు పెట్టింది. దీంతో అక్కడి వారు వెంటనే షాక్ కు గురయ్యారు. గుర్రాన్ని పట్టుకునేందుకు దాని యజమాని  దాని వెనకాలే లగేత్తాడు.  ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Horse, Viral Video, Wedding

తదుపరి వార్తలు