• Home
  • »
  • News
  • »
  • trending
  • »
  • HORROR BIKER HAS NO HEAD A VIDEO OF SUCH SHOCKING PEOPLE AND PASSENGERS ON ROAD THAT IS CURRENTLY GOING VIRAL ON SOCIAL MEDIA NK

Viral video: తల లేని మనిషి.. స్కూటీ డ్రైవ్ చేస్తుంటే ఏమైందో తెలుసా?.. వీడియో చూడండి

Viral video: తల లేని మనిషి.. స్కూటీ డ్రైవ్ చేస్తుంటే ఏమైందో తెలుసా?.. వీడియో చూడండి (image credit - instagram)

Viral video: ఆ స్కూటీ నడిపే వ్యక్తికి తల లేకపోవడం తోటి ప్రయాణికులను ఆశ్చర్య పరుస్తోంది. తల లేకుండా ఎలా డ్రైవ్ చేస్తున్నదీ మనకు తెలియాలి. ఆ వైరల్ వీడియో మనం కూడా చూసి ఎంజాయ్ చెయ్యాలి.

  • Share this:
    Viral video: తల లేకుండా బాడీ మాత్రమే బైక్ నడుపుతూ వెళ్తూ ఉంటే... మనకు ఎలా ఉంటుంది... వామ్మో... అదేంటి... తల ఏదీ... ఏమైంది... అని కంగారు పడతాం. ఒకింత ఉలిక్కి పడతాం. నిజానికి అలాంటివి రియల్‌గా కనిపిస్తే.. దెయ్యం అంటాం. కానీ అలాంటివి మనకు సినిమాల్లోనే కనిపిస్తాయి. ఎందుకంటే అక్కడ గ్రాఫిక్స్ ఉంటాయి. కానీ సోషల్ మీడియాలో ఇప్పుడో వీడియో వైరల్ అవుతోంది. అందులో ఓ వ్యక్తి నిజంగానే తల లేకుండా బండి నడుపుతున్నట్లు ఉంది. అతను ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర బండి ఆపినప్పుడల్లా.. చుట్టూ ఉన్న టూవీలర్, ఫోర్ వీలర్ ప్రయాణికులు ఆశ్చర్యపోయి చూస్తున్నారు. అందరిలోనూ అదే ప్రశ్న. తల ఏది?

    రోడ్డుపై బైక్ నడిపితే... కచ్చితంగా తలకు హెల్మెట్ పెట్టుకోవాలి... మరి తలే లేకపోతే... ఇక హెల్మెట్‌తో పనేముంది... ఆ వీడియోను మీరే చూడండి ఇక్కడ.



    చూశారుగా... ఆశ్చర్యంగా అనిపించింది కదూ. చుట్టూ ఉన్న ప్రజలు కూడా ఎంత ఆశ్చర్యంగా చూస్తున్నారో కదూ. నిజానికి అతనికి తల ఉంది. ఆ విషయం మనకు కూడా తెలుసు. కానీ తల లేనట్లు ఎలా చూపిస్తున్నాడంటే... అంతా ఆ కోటులోనే ఉంది. అది రెగ్యులర్ కోటు కాదు. నిఠారుగా నిలబడగల కోటు. జనరల్‌గా మ్యాజిక్ చేస్తారే... వాళ్లు ఇలాంటి కోట్లు వాడుతారు. ప్రజలను సరదాకా కన్‌ఫ్యూజ్ చెయ్యడానికి తల లోపల పెట్టి లేనట్లుగా నటిస్తారు. కొంత మంది డాన్సర్లు కూడా ఇలాంటి కోట్లు వాడుతారు. తల ఊడి కిందకు వచ్చి వేలాడినట్లుగా డాన్స్ చేస్తారు. తిరిగి తల యథాతథ స్థితికి తీసుకెళ్తారు. కానీ ఆ కొన్ని సెకండ్లూ తల నిజంగానే ఊడిపోయిందా అనిపించేలా ఉంటుంది ఆ డాన్స్. కింది వీడియోలో 1.48 దగ్గర అలాంటి సీన్ మీరు చూడవచ్చు.

    ఇది కూడా చదవండి: Business Ideas: TCSలో జాబ్ మానేశాడు... ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్న యువకుడు

    మనం చూసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో జాత్ కే జోక్స్ అనే అకౌంట్ వాళ్లు పోస్ట్ చేశారు. దానిపై రకరకాల కామెంట్స్ రావడం, వైరల్ అవ్వడం వింతేమీ కాదు కదా.
    Published by:Krishna Kumar N
    First published: