వైరల్ వీడియో... BMWని తుక్కు తుక్కు చేసిన ట్రైన్... డ్రైవర్ సేఫ్...

Viral Video : ఈ వీడియో చూసిన ఎవరైనా... డ్రైవర్ చనిపోయి ఉంటాడనే అనుకుంటారు. కానీ... స్వల్ప గాయాలతో అతను ఎలా బయటపడ్డాడన్నదే ఆశ్చర్యకరం.

news18-telugu
Updated: March 7, 2020, 10:04 AM IST
వైరల్ వీడియో... BMWని తుక్కు తుక్కు చేసిన ట్రైన్... డ్రైవర్ సేఫ్...
వైరల్ వీడియో... BMWని తుక్కు తుక్కు చేసిన ట్రైన్... డ్రైవర్ సేఫ్... (credit - twitter - LAPD HQ)
  • Share this:
Viral Video : ఓ భయంకర దృశ్యానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ వైపు ట్రైన వస్తుంటే... BMW కారు డ్రైవర్... ఆ ట్రైన్‌ను చూసుకోకుండా... ట్రాక్‌పైకి కారును నడిపాడు. రెప్పపాటు కాలంలో... ట్రైన్‌... BMWని తుక్కుతుక్కు చేసుకుంటూ వెళ్లిపోయింది. కారు బానెట్ పూర్తిగా నుజ్జు నుజ్జైంది. ఇందుకు సంబంధించిన వీడియోని లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్ట్‌మెంట్... ట్విట్టర్‌లో షేర్ చేసింది. సాధారణంగా ట్రైన్ వస్తున్నప్పుడు లెవెల్ క్రాసింగ్ దగ్గర గేట్లు మూసివేస్తారు. ఈ ఘటనలో కూడా ఓవైపు గేట్లు మూసుకుంటుంటే... ఆ కారు డ్రైవర్... వాటిని పట్టించుకోకుండా... ట్రాక్ పైకి కారును నడిపాడు. ఉదయం 11 గంటల సమయంలో... ఎలాంటి చీకటీ లేని చోట ఇలా జరిగిందని పోలీసులు తెలిపారు.


ఇంత ఘోర ప్రమాదం జరిగాక... డ్రైవర్ చనిపోయే అవకాశాలే ఎక్కువ. కాకపోతే అది BMW కారు కదా... అందులో ప్రయాణించేవారికి సేఫ్టీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి... ఈ ఘటనలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటనను చూశాక... మనం నేర్చుకోవాల్సింది చాలా ఉందన్న పోలీసులు... ఇకపై లెవెల్ క్రాసింగ్స్ దగ్గర ట్రాక్స్ దాటేవారు జాగ్రత్త పడాలని సూచించింది. ట్రాఫిక్ సిగ్నల్స్ ఎల్లప్పుడూ పాటించాలని కోరింది.


ప్రస్తుతం వైరల్ అయిన ఈ వీడియోని చూసిన వారంతా... డ్రైవర్ బతికే ఉన్నాడంటే నమ్మలేకపోతున్నారు. ఇంతలా డీకొట్టాక బతికే ఛాన్సే లేదంటున్నారు. ఈ కారుకి సంబంధించిన తాజా ఫొటోను లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్ట్‌మెంట్ కమాండర్ మార్క్ రెయినా... ట్విట్టర్‌లో షేర్ చేశారు. మంగళవారం ఉదయం ఈ ఘటన జరగగా... గాయపడిన డ్రైవర్‌ను బుధవారం ఉదయం ఆస్పత్రి నుంచీ డిశ్చార్జి చేశారు.
First published: March 7, 2020, 10:04 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading