రాహుల్‌గాంధీకి బ్రిటన్ పౌరసత్వం? నోటీసులు జారీ చేసిన కేంద్ర హోంశాఖ
రాహుల్ గాంధీ (File)
2003లో యూకేలో బ్యాకోప్స్ లిమిటెడ్ పేరుతో ఓ కంపెనీ రిజిస్టర్ అయ్యింది. దానికి డైరెక్టర్, సెక్రటరీ హోదాలో రాహుల్ ఉన్నారు. అయితే, కంపెనీ వార్షిక రిటర్ను దాఖలులో భాగంగా రాహుల్ తన జాతీయతను బ్రిటిష్‌గా నమోదు చేశారు
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పౌరసత్వ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఆయనకు బ్రిటన్ పౌరసత్వం ఉందని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా జత చేశారు. దీంతో హోంశాఖ రాహుల్‌గాంధీకి నోటీసులు జారీ చేసింది. ఫిర్యాదులో నిజానిజాలు ఎంత అన్నది 15 రోజుల్లోగా తెలపాలని కోరింది. సుబ్రమణ్యస్వామి తన ఫిర్యాదులో.. ‘2003లో యూకేలో బ్యాకోప్స్ లిమిటెడ్ పేరుతో ఓ కంపెనీ రిజిస్టర్ అయ్యింది. దానికి డైరెక్టర్, సెక్రటరీ హోదాలో రాహుల్ ఉన్నారు. అయితే, కంపెనీ వార్షిక రిటర్ను దాఖలులో భాగంగా రాహుల్ తన జాతీయతను బ్రిటిష్‌గా నమోదు చేశారు’ అని పేర్కొన్నారు.
రాహుల్‌కు కేంద్ర హోంశాఖ జారీ చేసిన నోటీసు
దీంతో రంగంలోకి దిగిన హోంశాఖ పౌరసత్వ వివాదంపై వివరణ ఇవ్వాలని రాహుల్‌ను కోరింది. మరోవైపు, రాహుల్ నామినేషన్లను కూడా సవాల్ చేస్తూ స్వామి పిటిషన్ దాఖలు చేశారు. రాహుల్‌కు బ్రిటన్ పౌరసత్వం ఉందని, భారతీయుడు కాని ఆయన భారత ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తారని ప్రశ్నించారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.