ఎస్‌బీఐలో గృహ రుణాలు పొందారా.. అయితే మీకు గుడ్ న్యూస్..

SBI Home Loans : రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి రెపో రేట్‌ను తగ్గించడంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించింది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 7, 2019, 6:17 PM IST
ఎస్‌బీఐలో గృహ రుణాలు పొందారా.. అయితే మీకు గుడ్ న్యూస్..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి రెపో రేట్‌ను తగ్గించడంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించింది. ఆర్బీఐ రెపో రేట్‌ను తగ్గించడంతో తన ఖాతాదారులకూ ప్రయోజనం అందించాలని ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ ద్రవ్య విధాన సమీక్ష ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే ఎస్‌బీఐ ఈ ప్రకటన చేయడం విశేషం. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేట్‌ను 15 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. ఈ కొత్త రేట్లు ఆగస్టు 10 నుంచి వర్తిస్తాయని తెలిపింది. ప్రస్తుతం రుణ కాలపరిమితి ఓవర్‌నైట్ అయితే 8.05 శాతం ఎంసీఎల్ఆర్ ఉంది, దీన్ని 7.90కి తగ్గించింది. ఒక నెల కాలపరిమితి గల రుణానికి 7.90 శాతానికి, 3 నెలలకు 7.95 శాతానికి, అన్ని కాల పరిమితుల రుణాలకు 0.15 శాతం తగ్గిస్తున్నట్లు పేర్కొంది.

కాగా, ఆర్బీఐ 2019-20 మూడో ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్షను బుధవారం ప్రకటించింది. రెపో రేటును 35 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో బుధవారం సమావేశమైన మానిటరీ పాలసీ నిర్ణయించింది. ఈ ఏడాది ఆర్‌బీఐ రెపో రేట్ తగ్గించడం ఇది నాలుగోసారి. వరుసగా మూడుసార్లు 25 బేసిస్ పాయింట్ల చొప్పున తగ్గించిన ఆర్‌బీఐ ఈసారి 35 బేసిస్ పాయింట్స్ తగ్గించడం విశేషం. దీంతో రెపో రేట్ ఏకంగా 5.40 శాతానికి దిగి వచ్చింది. మిగిలిన బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంది.

First published: August 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు