నేనూ పోర్న్‌కు బానిస అయ్యానంటున్న స్టార్ హీరోయిన్.. అలా చేసుంటే ఈ రోజు..

పోర్న్ వ్యసనానికి తాను అతీతమేమీ కాదని అంటోంది హాలీవుడ్ స్టార్ జాడా పింకెట్ స్మిత్. సూపర్ స్టార్ విల్ స్మిత్‌ను పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలను కన్న ఈ బ్యూటీ.. గతంలో తాను పోర్న్‌కు, సెక్స్‌కు ఎలా బానిస అయ్యానన్నది చెప్పుకొచ్చారు.

news18-telugu
Updated: June 4, 2019, 11:12 AM IST
నేనూ పోర్న్‌కు బానిస అయ్యానంటున్న స్టార్ హీరోయిన్.. అలా చేసుంటే ఈ రోజు..
జాడా పింకెట్ స్మిత్ (ట్విట్టర్ ఫోటో)
  • Share this:
పోర్న్.. ఎంతోమందిని బానిసగా మార్చుకుంది. ముఖ్యంగా యువతను పట్టి పీడిస్తోంది. ఒక్కసారి దానికి అడిక్ట్ అయ్యారంటే ఊరికే వదలదు. ఆ వీడియోల్లో నటించే నటీనటుల ఫిజిక్, వారి హావభావాలను చూసి ఉద్రేకానికి గురై మళ్లీ మళ్లీ చూసేలా చేయడంతో వాటిని యువతీ యువకులు వ్యసనంగా మార్చుకుంటున్నారు. ఆ వ్యసనానికి తాను అతీతమేమీ కాదని అంటోంది హాలీవుడ్ స్టార్ జాడా పింకెట్ స్మిత్. సూపర్ స్టార్ విల్ స్మిత్‌ను పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలను కన్న ఈ బ్యూటీ.. గతంలో తాను పోర్న్‌కు, సెక్స్‌కు ఎలా బానిస అయ్యానన్నది చెప్పుకొచ్చారు. ‘నేను పోర్న్ అనే ఒక అనారోగ్యానికి బానిస అయ్యా. ఇప్పటికీ తాను ఆ వ్యసనంలోనే ఉండి ఉంటే.. ఈ రోజు అభిమానులకు మంచి పోర్న్ వీడియోలు అందించేదాన్నేమో. అయితే, ఆ సమయంలో తాను ఎవరితో రిలేషన్‌షిప్‌లో లేనని ఆమె తెలిపారు. మహిళలు సెక్స్‌పై తమ అభిప్రాయాలను పురుషులు చెప్పినంత ఈజీగా బయటికి చెప్పుకోలేరని, సంస్కృతి, పెరిగిన వాతావరణం దానికి అడ్డుపడుతుందని వెల్లడించారు.

కాగా, 22 ఏళ్ల క్రితం విల్ స్మిత్‌ను పెళ్లాడిన జాడాకు ఒక కుమారుడు జాడెన్(19), కూతురు విల్లో (17) ఉన్నారు. స్మిత్ దంపతులు గతంలో విడాకులు తీసుకుంటారన్న వార్తలు కూడా సోషల్ మీడియాలో కోడై కూశాయి. అయితే, అలాంటిదేమీ లేదని తాను భర్త నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు వస్తున్న వార్తలు పుకార్లేనని స్పష్టం చేసింది. ‘విడాకుల పుకార్లను గమనిస్తున్నా. విల్‌స్మిత్, నేను ఓ మంచి కుటుంబం. మేం విడిపోవడం ఈ జన్మలో జరగదు. మా మధ్య ఉన్న బంధం తుదిశ్వాస వరకూ కొనసాగుతుంది. నా జీవితం చివరి క్షణాల వరకు నాతోనే ఉండే ఒకే వ్యక్తి విల్‌స్మిత్’ అని ఆమె తెలిపారు.

ఇవి కూడా చదవండి:

నాకు సెక్స్ అంటే తెగ ఇష్టం.. ప్రేమ అంటే భయం అంటున్న ప్రముఖ హీరోయిన్..

భార్యాభర్తల వాదన.. ఆ తర్వాత సెక్స్ చేస్తే ఎలా ఉంటుందంటే..

షాక్: భార్యాభర్తల మధ్య తగ్గుతున్న సెక్స్.. కారణం అదే..

పోర్న్ వీడియోలు చూడటం మంచిది కాదా? దాని ప్రభావం ఎలా ఉంటోందంటే..

పది మందిలో ఆరుగురు ‘పోర్న్‌’కు బానిసలే.. మరిన్ని ఆసక్తికర అంశాలు వెలుగులోకి..
Published by: Shravan Kumar Bommakanti
First published: June 4, 2019, 11:11 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading