HOLES IN HAND VIDEO GOES VIRAL IN SOCIAL MEDIA KNOW THE REALITY OF THAT VIRAL PHOTO AND VIDEO HERE IS FACT CHECK SK
అరచేతి నిండా రక్తపు రంధ్రాలు.. మరో భయంకరమైన వైరస్ వచ్చిందా? ఆ వీడియో ఎక్కడిది?
వైరల్ అవుతున్న ఫొటో (Image:Youtube grab)
Fact Check: ఇది చాలా భయకంరమైన రోగమంటూ ఓ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ ఫొటోలో ఒక చేతి కనిపిస్తుంది. దాని నిండా రంధ్రాలు ఉన్నాయి. అందులో నుంచి రక్తం వస్తున్నట్లుగా ఉంది.
ఇప్పటికే రెండేళ్లుగా కరోనా మహమ్మారి (Covid-19 pandemic)తో యావత్ ప్రపంచం పోరాడుతోంది. కోవిడ్ దెబ్బకు అందరి జీవితాలు తలకిందులయ్యాయి. కొందరు తమకు ఇష్టమైన వారిని కోల్పోతే.. మరికొందరు ఉపాధి అవకాశాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. రెండేళ్లు గడిచినా.. ఇంకా దీని పీడ ఇంకా విరగడ కాలేదు. కొత్త కొత్త రూపాల్లోకి మారి మానవాళిపై విరుచుకుపడుతూనే ఉంది. గత ఏడాది డెల్టా వేరియెంట్ (Delta Variant) ఎంతో మంది ప్రాణాలను తీస్తే.. ఈసారి ఒమిక్రాన్ (Omicron) వణికిస్తోంది. ఇంకా ఈ కరోనా కోరల నుంచి బయట పడక ముందే మరో కొత్త వ్యాధి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇది చాలా భయకంరమైన రోగమంటూ ఓ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ ఫొటోలో ఒక చేతి కనిపిస్తుంది. దాని నిండా రంధ్రాలు ఉన్నాయి. అందులో నుంచి రక్తం (Blood Holes in Hand Viral Video) వస్తున్నట్లుగా ఉంది. ఆ ఫొటోను చూస్తే ఎవరికైనా ఒళ్లు జలదరిస్తుంది.
ఇటీవల ఓ ఇన్‌స్టగ్రామ్ (Instagram) యూజర్ ఆ ఫొటోను పోస్ట్ చేశాడు. దానికి క్యాప్షన్ ఇలా రాశారు. కరోనా ఇంకా మనల్ని వీడలేదు. అంతలోనే మరో కొత్త విపత్తు వచ్చిపడింది. ఈ కొత్త వ్యాధి కారణంగానే చేతులు ఇలా మారుతున్నాయి. చేతులకు చిల్లులు పడి రక్తం బయటకువస్తుందని పేర్కొన్నాడు. ఆ పోస్ట్‌ను చూసి చాలా మంది స్పందించారు. వామ్మో.. ఇదేం కొత్త రోగం.. చాలా భయంకరంగా ఉందని కామెంట్ చేశారు. కొత్త కొత్త రోగాలతో మానవాళి అంతరించిపోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఇంకొందరు అభిప్రాయపడ్డారు.
ఐతే సోషల్ మీడియాలో దీని గురించి మరింతగా సెర్చ్ చేస్తే.. ఇదే ఫొటో 2017లోనూ వైరల్ అయినట్లు తేలింది.ఈ వ్యాధి వస్తే చేతులకు రంధ్రాలు పడి, రక్తం కారుతుందని అప్పట్లో కూడా ప్రచారం జరిగింది. ఐతే ఆ ఫొటో గురించి ఇప్పడు పూర్తిగా క్లారిటీ వచ్చింది. అసలు ఆ వ్యాధి నిజమేనా? కాదా? అని క్యాటర్స్ క్లిప్ అనే వార్తా సంస్థ బయటపెట్టింది. చేతులకు రంధ్రాలు పడి రక్తం కారుతున్న ఫొటోలు, వీడియోల్లో నిజం లేదని.. ఎలాంటి కొత్త వ్యాధి రాలేదని ఆ యూట్యూబ్ ఛానెల్ తెలిపింది. దీని వెనక ఉన్న అసలు నిజాన్ని కూడా వెల్లడించింది.
సదరు యూట్యూబ్ ఛానెల్ వెల్లడించిన వివరాల ప్రకారం.. వైరల్ అవుతున్న ఫొటో నిజమైనది కాదు. బ్రిజెట్ ట్రెవినో అనే మేకప్ ఆర్టిస్ట్ వేసిన హ్యాండ్ పెయింటింగ్. 2017లో ఈ హ్యాండ్ పెయింటింగ్‌ను వేశారు. మేకప్‌తో చేయిని అలా మార్చేశారు. అప్పటి నుంచి ఆ వీడియో వైరల్ అవుతూనే ఉంది. కొత్త వ్యాధి వచ్చిందని.. చేతులకు రంధ్రాలు పడి రక్తం కారుతుందని.. ప్రచారం జరిగింది. ఇందులో నిజాన్ని తెలుసుకోకుండా చాలా మంది నమ్మారు. ఆ ఫొటోలను వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం కరోనా కాలం నడుస్తుండడంతో తాజా మరోసారి అవి వైరల్ అవుతున్నాయి. చాలా మంది వాటిని చూసి నిజమేనని నమ్మేస్తున్నారు. వామ్మో.. అని భయపడిపోతున్నారు. ఐతే ఇందులో ఏ మాత్రం నిజంలేదు. అది నిజమైన ఫొటో కాదు... కేవలం హ్యాండ్ పెయింటింగ్ మాత్రమే..!
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.