హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral: యాక్షన్ సినిమా రేంజ్‌లో తుపాకీ పట్టి రెచ్చిపోయిన యువతి.. భారీ షాకిచ్చిన పోలీసులు..!

Viral: యాక్షన్ సినిమా రేంజ్‌లో తుపాకీ పట్టి రెచ్చిపోయిన యువతి.. భారీ షాకిచ్చిన పోలీసులు..!

తుపాకీతో హల్ చల్ చేస్తున్న యువతి

తుపాకీతో హల్ చల్ చేస్తున్న యువతి

ఈరోజుల్లో యువత చేస్తున్న ఆకతాయి చేష్టలు శృతి మించుతున్నాయి. ఇతరులకు దడ పుట్టించేలా బహిరంగ ప్రదేశాల్లో రెచ్చిపోతున్నారు. రోజురోజుకీ వీరి ఆగడాలకు అడ్డుఅదుపు లేకుండా పోతోంది. ఇటువంటి వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా కూడా ఒక అమెరికా యువతి మారణాయుధమైన ఏకే-47 తుపాకీ చేతపట్టి హడలెత్తించింది.

ఇంకా చదవండి ...


ఈరోజుల్లో యువత చేస్తున్న ఆకతాయి చేష్టలు శృతి మించుతున్నాయి. ఇతరులకు దడ పుట్టించేలా బహిరంగ ప్రదేశాల్లో రెచ్చిపోతున్నారు. రోజురోజుకీ వీరి ఆగడాలకు అడ్డుఅదుపు లేకుండా పోతోంది. రోడ్లపై కూడా స్టంట్స్ చేస్తూ ఇతరుల ప్రాణాలకు హాని తలపెడుతున్నారు. ఇటువంటి వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా కూడా ఒక అమెరికా యువతి మారణాయుధమైన ఏకే-47 తుపాకీ చేతపట్టి హడలెత్తించింది.యాక్షన్ సినిమా రేంజ్‌లో స్టంట్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. ఐతే, ఈ ఫోటో వైరల్ కాగా.. పోలీసులు ఆమె కారును సీజ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని కొందరు ఆకతాయిలు బార్నెవెల్డ్ & మెక్‌కిన్నన్ మార్గాల్లో చట్టవిరుద్ధంగా ఓ స్పీడ్ ఈవెంట్ నిర్వహించారు. డ్రాగ్ రేసింగ్ అంటూ బార్నెవెల్డ్ ప్రదేశంలో బీభత్సం సృష్టించారు. ఈ స్పీడ్ ఈవెంట్ లో పాల్గొన్న ఒక యువతి బాగా రెచ్చిపోయింది. వేగంగా కదులుతున్న తన కాడిలాక్ కారు కిటికీలోంచి బయటకు తొంగి చూస్తూ తన చేతిలో ఏకే 47 తుపాకీతోయాక్షన్ సినిమా రేంజ్‌లో పోజులిచ్చింది.

తుపాకీ ట్రిగ్గర్ పై చేయి పెట్టి రెచ్చిపోయింది. అమెరికాలో తుపాకీలు విచ్చలవిడిగా వాడే సంస్కృతితో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఎటువైపు నుంచి ఎవరు తుపాకీ దాడులు చేస్తారో అనే ఆందోళన ప్రజల్లోనెలకొంది. ఈనేపథ్యంలో ఈ యువతి డెడ్లీ వెపన్ పట్టుకొని మరింత భయాందోళనలకు గురి చేసింది. ఆమెకు సంబంధించిన ఓ ఫొటో వెలుగులోకి రాగా.. శాన్ ఫ్రాన్సిస్కో పోలీసులు సీరియస్ అయ్యారు. ఈ ఘటన గురించి శాన్ ఫ్రాన్సిస్కో పోలీస్ డిపార్ట్‌మెంట్ ట్రాఫిక్ కంపెనీ సభ్యులకు తెలియజేశారు. సమాచారం అందగానే రంగంలోకి దిగిన ట్రాఫిక్ అధికారులు దర్యాప్తు చేసి బుధవారం రోజు కాడిలాక్‌ను స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం ఆమె కారును సీజ్ చేస్తున్న ఫొటో ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఏకే 47తో హడల్ పుట్టించిన సదరు యువతి ఏమైనా కాల్పులు జరిపిందా లేదా అనే విషయాన్ని తెలపలేదు. ఈ ఘటనలో ఎవరైనా అరెస్ట్ అయ్యారా లేదా అనేది కూడా తెలియరాలేదు. ఈ ఫొటోను జులై నెల 11వ తేదీన తీసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతుందనిపోలీసులు తెలిపారు. ఈ ఫొటో పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. జనాలు తుపాకీలు వినియోగించకుండా కఠిన చట్టాలు తీసుకురావాలని కామెంట్స్ చేస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైన గన్నులను పూర్తిగా బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

Published by:Veera Babu
First published:

Tags: America, Gun fire, Hollywood, International news, USA, Viral, WOMAN

ఉత్తమ కథలు