• Home
  • »
  • News
  • »
  • trending
  • »
  • HOAX CALL TIGER ENTERED AT NIGHT IN A SCHOOL IN HYDERABAD IS NOT REAL NK

హైదరాబాద్‌లో పులి కలకలం... ఆకతాయిల పనిగా తేల్చిన అధికారులు

ప్రతీకాత్మక చిత్రం

Hyderabad : హైదరాబాద్‌ శివార్లలో ఇటీవల పులుల కలకలం ఎక్కువవుతోంది. తాజాగా స్కూల్లో పులి దూరిందని కలకలం రేగింది.

  • Share this:
హైదరాబాద్.. ప్రగతి భవన్‌లో పులి అరుపులు వినిపించాయి. చుట్టుపక్కల వాళ్లు షాకయ్యారు. ఎవరో టీవీలో డిస్కవరీ ఛానెల్ పెద్ద సౌండ్‌తో చూస్తున్నారని అనుకున్నారు. కానీ.. కొన్ని క్షణాలకే అవి నిజమైన అరుపులని అనుకున్నారు. వెంటనే టెన్షన్ మొదలైంది. ఎవరికి వాళ్లు తమ తమ అపార్ట్‌మెంట్లలోకి పులి వచ్చిందేమో అని కంగారుపడ్డారు. చివరకు అక్కడున్న గీతాంజలి స్కూల్లోంచీ అరుపులు వినిపిస్తున్నాయని అనుకున్నారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు కాల్స్ వెళ్లిపోయాయి. వాళ్లు కూడా రాత్రికి రాత్రి పులిని పట్టుకుందామని సరంజామాతో వచ్చారు. కానీ... రాత్రంతా ప్రయత్నించినా పులిని పట్టుకోలేకపోయారు. ఎందుకంటే అసలు అక్కడ పులే లేదు. తెల్లారిన తర్వాత అధికారులు అక్కడ పులి లేదని తేల్చారు. ఇదంతా ఆకతాయిల పని అని స్పష్టం చేశారు.
Published by:Krishna Kumar N
First published: