Dr Rekha Krishnan: ముస్లిం రోగి చెవిలో కలీమా వినిపించిన హిందూ డాక్టర్.. నెటిజన్ల సెల్యూట్

Image: Rekha Krishnan/Facebook

కరోనా.. కొన్నిచోట్ల మనుషుల్లో దాగిన మానవత్వాన్ని వెలుగులోకి తీసుకోస్తోంది. కులాలు, మతాల మధ్య అడ్డుగోడలను తొలగిస్తోంది.

 • Share this:
  ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను బలిగొంటున్న కరోనా.. కొన్నిచోట్ల మనుషుల్లో దాగిన మానవత్వాన్ని వెలుగులోకి తీసుకోస్తోంది. కులాలు, మతాల మధ్య అడ్డుగోడలను తొలగిస్తోంది. తాజాగా ఓ మహిళా వైద్యురాలు ఆస్పత్రిలో చేసిన పని ఇప్పుడు సర్వత్ర ప్రశంసలు అందుకుంటుంది. ఇందుకు కారణమేమిటంటే హిందువైన ఆ డాక్టర్.. కరోనాతో చికిత్స పొందుతున్న ముస్లిం రోగి చెవిలో ఇస్లామిక్ ప్రార్థనలు చేశారు. కేరళలో చోటుచేసుకున్న ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. వివరాలు.. ఓ ముస్లిం మహిళా కరోనా సోకడంతో రెండు వారాల క్రితం ఆస్పత్రిలో చేరారు. ఆమె పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. కోవిడ్ నిబంధనల ప్రకారం ఆమెను చూసేందుకు కుటుంబ సభ్యులకు అనుమతి నిరాకరించబడింది.

  అయితే మే 17వ తేదీన ఆ రోగి పరిస్థితి మరింతగా క్షీణించిడం మొదలైంది. దీంతో ఆమె చావు బతుకుల మధ్య పోరాడుతుంది. ఆమె అవయవాలు కూడా చికిత్సకు స్పందించడం మానేస్తున్నాయి. పరిస్థితి పూర్తిగా చేజారిపోవడంతో.. వైద్యులు ఆమెను వెంటిలేటర్‌పై నుంచి తొలగించాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు కూడా తెలియజేశారు.

  ఆ సమయంలో డాక్టర్ రేఖ కృష్ణన్ అక్కడే ఉన్నారు. చివరి క్షణాల్లో రోగికి కొంతైన ఓదార్రపు ఇవ్వాలని రేఖ భావించారు. ఆమె దగ్గరికి వెళ్లిన రేఖ.. చెవిలో కలీమా (లా ఇలాహా ఇల్లల్లా, ముహమ్మద్ రసూలుల్లా) చదివి వినిపించారు. ఆ తర్వాత దీర్ఘంగా శ్వాస తీసుకున్న మహిళా రోగి.. కాసేపటికే కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆమె తన సహచర వైద్యుడికి చెప్పడంతో.. అతడు అక్కడ జరిగిన మొత్తాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

  ఈ ఘటనకు సంబంధించి రేఖ మాట్లాడుతూ..‘ఆమె చుట్టూ బంధువులు ఎవరూ లేనందున.. నేను ఆమె కోసం ఏదైనా చేయాలని అనుకున్నాను. నేను యూఏఈలో పెరిగిన కారణంగా.. నాకు ముస్లింల ప్రేయర్స్, పద్దతుల గురించి తెలుసు. నేను ప్రార్థనను సున్నితంగా పఠించి కళ్లు మూసుకున్నాను. అప్పుడు రోగి లోతైన శ్వాస తీసుకుంది.నిజానికి అలా చేయాలని ముందుగా ఏమీ అనుకోలేదని, అప్పటికప్పుడు అలా చేయాలనిపించడంతో వెంటనే చేశానని’తెలిపారు.

  ‘మేము(వైద్యులు) ఎదుర్కొంటున్న ఒత్తిడిని ఎవరూ అర్థం చేసుకోరు. కోవిడ్ కారణంగా, మేము ఇప్పుడు ఈ రోగుల కుటుంబంగా మారాము’ అని డాక్టర్ రేఖ తెలిపారు. ప్రస్తుతం రేఖ చర్యను పలువురు అభినందిస్తున్నారు. మత సామరస్యానికి రేఖ ప్రతీక నిలిచిందని పేర్కొంటున్నారు.
  Published by:Sumanth Kanukula
  First published: