HIMACHAL PRADESH A LEOPARD CUB THAT ENTERED AN ATM SB
చలిని తట్టుకోలేక ఏటీఎంలోకి దూరిన పులి పిల్ల
ఏటీఎంలోకి దూరిన చిరుతపులి పిల్ల ( ట్విట్టర్ ఫోటో)
మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో ఏటీఎంలోకి డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లిన ఓ వ్యక్తి పులి పిల్లను చూసి భయంతో బయటకు పరుగులు తీశాడు. గట్టిగా అరుపులు, కేకలు పెట్టడంతో చుట్టుపక్కల వారంతా అక్కడకు చేరుకున్నారు.
త కొన్ని రోజులుగా జనావాసాల్లోకి చిరుతల సంచారం కలకలం సృష్టిస్తుంది. ఈ మధ్య జనంలోకి వన్య ప్రాణులు వచ్చేస్తున్నాయి. దీంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా హిమాచల్ ప్రదేశ్లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. మండి జిల్లా తుంగ్ ప్రాంతంలో ఓ చిరుతపులి పిల్ల ఏటీఎంలోకి ప్రవేశించింది. మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో ఏటీఎంలోకి డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లిన ఓ వ్యక్తి పులి పిల్లను చూసి భయంతో బయటకు పరుగులు తీశాడు. గట్టిగా అరుపులు, కేకలు పెట్టడంతో చుట్టుపక్కల వారంతా అక్కడకు చేరుకున్నారు. ఏటీఎంలో దూరిన పులిపిల్లను బయటకు తీసేందుకు ప్రయత్నించారు.
ఓ టాక్సీ డ్రైవర్ సాహసం చేసి బుల్లి చిరుతను బయటకు తీశాడు. దీంతో అది వెంటనే అక్కడున్న ఓ వాహనం కిందకు వెళ్లి దాక్కొంది. దీంతో చిరుత పులి పిల్లను పట్టుకోవాలంటూ అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న ఫారెస్ట్ ఆఫీసర్లు పులి పిల్లను పట్టుకొని అడవిలో వదిలారు.
అయితే చలి ఎక్కువగా ఉన్న కారణంతోనే... ఏటీఎంలో చిరుత పులి పిల్ల దాక్కొందని చెబుతున్నారు. చలిని తట్టుకోలేక పులి ఇలా ఏటీఎంలో దూరిందంటున్నారు. మరోవైపు అటవీ శాఖ వన్యప్రాణుల సంరక్షణను విస్మరించిన కారణంగానే పులులు, చిరుతలు జనంలోకి వస్తున్నాయంటున్నారు ప్రజలు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.