యువ స్ప్రింటర్ హిమాదాస్‌కు సచిన్ టెండుల్కర్ ప్రత్యేక కానుక!

అస్సాం స్ప్రింటర్‌కు జెర్సీని కానుకగా ఇచ్చిన క్రికెట్ లెజెండ్... ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన హిమాదాస్...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: September 28, 2018, 4:46 PM IST
యువ స్ప్రింటర్ హిమాదాస్‌కు సచిన్ టెండుల్కర్ ప్రత్యేక కానుక!
అస్సాం స్ప్రింటర్‌కు జెర్సీని కానుకగా ఇచ్చిన క్రికెట్ లెజెండ్... ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన హిమాదాస్...
  • Share this:
ఏషియాడ్ 2018లో మూడు పతకాలు సాధించి రికార్డు సృష్టించిన భారత యువ స్ప్రింటర్ హిమాదాస్‌కు అదిరిపోయే బహుమతి ఇచ్చి ఆశ్చర్యపరిచారు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండుల్కర్. క్రీడాపురస్కారాల్లో ‘అర్జున’ అవార్డు అందుకున్న హిమాదాస్... తాజాగా తన ఫేస్‌బుక్ ఖాతాలో సచిన్ టెండుల్కర్‌తో దిగిన ఫోటోలను పోస్ట్ చేసింది.

‘ఈరోజు నాకెంతో ప్రత్యేకమైన రోజు. నా లెజెండ్ సచిన్ టెండుల్కర్‌ను కలిశాను... ఆయన నాకు మరిచిపోని బహుమతి ఇచ్చారు. తన జెర్సీని కానుకగా ఇచ్చారు. ఆయన మాటలతో నాలో ఎంతో స్ఫూర్తిని నింపిన టెండుల్కర్‌కి కృతజ్ఞతలు...’ అంటూ రెండు ఫోటోలను పోస్ట్ చేసింది హిమాదాస్. రిటైర్మెంట్ తర్వాత సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటున్న మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్... ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన ప్రతి ఒక్కరికీ అభినందిస్తూ ట్వీట్స్ చేశారు. అయితే అస్సాంలో ఓ మారుమూల గ్రామంలో రైతు కుటుంబంలో పుట్టి... ఏషియాడ్‌లో అద్భుతంగా రాణించి మూడు పతకాలు గెలిచిన హిమాదాస్‌ను అభినందిస్తూ ఆయన ప్రత్యేకంగా జెర్సీని అందచేయడం విశేషం.


ఫిన్‌లాండ్‌లో జరిగిన ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెట్స్ ఫెడరేషన్ అండర్ 20 ఛాంపియన్‌షిప్స్‌లో (వంద మీటర్ల ఫైనల్ ఈవెంట్‌లో) స్వర్ణం పతకం సాధించిన హిమాదాస్... అంతర్జాతీయ వేదిక మీద పసిడి పతకం సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డు క్రియేట్ చేసింది. 2018 ఏషియాడ్ గేమ్స్‌లో 100 మీటర్ల ఈవెంట్‌లో రజత పతకం సాధించిన హిమాదాస్...మిక్స్‌డ్ రిలే 4 x 400 మీటర్ల ఈవెంట్‌లో రజతం... మహిళల 4 x 400 మీటర్ల రిలే ఈవెంట్‌లో స్వర్ణం పతకం సాధించి సరికొత్త రికార్డుల సృష్టించింది. ఈ 18 ఏళ్ల యువసంచలనం అస్సాం రాష్ట్ర స్పోర్ట్స్ అంబాసిడర్‌గా ఎంపికైన విషయం తెలిసిందే.

First published: September 28, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు