Funny Video Of Thief : ఈ మధ్యకాలంలో దొంగలు రెచ్చిపోతున్నారు. చెవికమ్మల కోసం చిన్నారుల్ని..మెడలో గొలుసుల కోసం పెద్దవారిని చంపేసి వారి వాటిని ఎత్తుకెళ్తున్నారు. ఇంకొందరు ఇళ్లను గుళ్ల చేస్తున్నారు. మరికొందరు బెదిరించి జనం దగ్గరున్మ సొమ్మును, నగల్ని ఎత్తుకెళ్తారు. దొంగలు దోపిడీ చేసిన అనంతరం ఎవరి కంట పడకుండా వెళ్లిపోవడం మనం చూస్తుంటాం. అయితే ఈ దొంగ(Thief) మాత్రం పోలీసులకు దొరికిపోయాడు. దొంగతనం చేశానని నిజాయితీగా ఒప్పుకున్నాడు. అయితే ఎందుకు దొంగతనం చేశావు అని పోలిసులు(Police) అడిగిన ప్రశ్నకి ఆ దొంగ చెప్పిన సమాధానం విని పోలీసులకు నవ్వు ఆగలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ వీడియోలో వైరల్(Video Viral) అవుతోంది.
ఛత్తీస్‌గఢ్(Chattisgarh) రాష్ట్రంలోని దుర్గ్ జిల్లాలో ఇటీవలే రూ. 10 వేల దొంగతనం జరిగింది. బాధిత వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. దొంగతనం ఆరోపణపై ఒక యువకుడిని పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. వైరల్ అవుతున్న వీడియోలో...పోలీస్ స్టేషన్ లో నిలబడి ఉన్న దొంగను డబ్బులను ఎందుకు దొంగిలించావు అని మరికొందరు పోలీసుల సమక్షంలో దుర్గ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డా. అభిషేక్ ప్రశ్నించారు. దొంగతనం చేసిన తర్వాత నీకు ఎలా అనిపించిందన్న ప్రశ్నకు...దొంగతనం చేసినందుకు పశ్చాత్తాపపడ్డాను సార్ అని ఆ దొంగ సమాధానమిచ్చాడు. తరువాత ఎందుకు పశ్చాత్తాప పడ్డావు? అని ఆ దొంగను ప్రశ్నించగా.. తప్పు చేశాను సార్ తాను 10వేలు దాంగతనం చేశాను అని ఒప్పుకున్నాడు దొంగ. అయితే దొంగతనం చేసిన డబ్బులతో ఏం చేశావ్ అని అడుగగా.. ఒక గొప్ప పని కోసం అని చెబుతాడు. దీంతో అక్కడున్న పోలీసులంతా గట్టిగా నవ్వుతారు. చలి తీవ్రంగా ఉండటంతో వీధుల్లో ఉండే వృద్ధులు, కుక్కలు, ఆవులకు దొంగిలించిన డబ్బుతో బెడ్షీట్లు కొని ఇచ్చానని ఆ దొంగ చెప్పుకొచ్చాడు.
दिलदार चोर ????❤️ pic.twitter.com/SSax12oh55
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) December 2, 2022
Viral video : రీల్స్ కోసం కుక్కను కాలితో తన్నింది.. ట్రోల్స్‌కి దిగివచ్చి.. సారీ చెప్పింది
అతని గొప్ప మనసుకు పోలీసులు ఫిదా అయ్యారు. మరి వారి నుంచి నీకు ఆశీర్వాదం లభించిందా అని పోలీసులు అడగ్గా.. ఆశీర్వాదం తీసుకున్నాను సర్ అని దొంగ తెలిపాడు.సమాధానమిచ్చాడు. ఈ వీడియో @Gulzar_sahab అనే ట్విట్టర్ అకౌంట్ లో డిసెంబర్ 2న షేర్ చేయబడింది. దిల్దార్ చోర్ అనే క్యాప్షన్ తో షేర్ చేయబడిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, కామెంట్స్ వస్తున్నాయి. వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేశారు. కాగా, గతంలో తమిళనాడు ,ఢిల్లీలో సహా పలు ప్రాంతాల్లో కూడా ఈ తరహా సంఘటనలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టులో ఢిల్లీలో పోలీసులకు పట్టుబడిన వాసిమ్ విక్రమ్ అనే 27 ఏళ్ల ఓ దొంగ.. తాను పెద్ద ఇళ్లల్లో దొంగతనం చేసి అందులో కొంత భాగాన్ని పేదలకు పంచేవాడినని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chatisghad, Viral Video