Plastic Waste: ప్లాస్టిక్ వ్యర్థాలతో 703 కిలోమీటర్ల మేర రోడ్లను నిర్మించాం.. లోక్‌సభలో ప్రకటించిన నితిన్ గడ్కరీ..

ప్రతీకాత్మక చిత్రం( Image @NITIN_GADKARI)

ప్లాస్టిక్ వ్యర్థాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఇతర దేశాల్లో ఈ వ్యర్థాలు రీసైక్లింగ్ చేయడమో లేదా ఇతర అవసరాలకు వినియోగించడమో చేస్తున్నారు. చైనాలో ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్లు కూడా వేస్తున్నారు. మన దేశంలోనూ ఈ తరహాలో వ్యర్థాలను ఉపయోగించి జాతీయ రహదారులను నిర్మించామని లోక్ సభలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.

  • Share this:
ప్లాస్టిక్ వ్యర్థాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఇతర దేశాల్లో ఈ వ్యర్థాలు రీసైక్లింగ్ చేయడమో లేదా ఇతర అవసరాలకు వినియోగించడమో చేస్తున్నారు. చైనాలో ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్లు కూడా వేస్తున్నారు. మన దేశంలోనూ ఈ తరహాలో వ్యర్థాలను ఉపయోగించి జాతీయ రహదారులను నిర్మించామని లోక్ సభలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. దాదాపు 703 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను ప్లాస్టిక్ వ్యర్థాలతో నిర్మించినట్లు ఆయన తెలిపారు. జాతీయ రహాదారుల నిర్మాణంలో హాస్ట్ మిక్స్‌తో పాటు ప్లాస్టిక్‌ను తప్పనిసరిగా ఉపయోగించాలని రవాణా మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను జారీ చేసినట్లు నితిన్ గడ్కరీ లోక్ సభకు లిఖిత పూర్వకంగా తెలియజేశారు. 5 లక్షలకుపైగా జనాభా ఉన్న పట్టణ ప్రాంతంలో జాతీయ రహదారులకు పక్కగా 50 కిలోమీటర్ల వరకు సర్వీస్ రోడ్డును ప్లాస్టిక్ వ్యర్థాలతో నిర్మించామని ఆయన తెలిపారు.

రహదారి నిర్మాణంలో ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించడం వల్ల దీని ప్రతికూల ప్రభావం నుంచి పర్యావరణాన్ని రక్షించవచ్చు. ప్లాస్టిక్ రహదారి.. 6 నుంచి 8 శాతం ప్లాస్టిక్, 93 నుంచి 94 శాతం బిట్‌మెన్‌ను కలిగి ఉంటుంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) నివేదిక ప్రకారం 2018-19లో భారత్‌లో రోజుకు 9200 టన్నులు చొప్పున 3.3 మిలియన్ మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అయ్యాయి. రహదారుల నిర్మాణంలో ప్లాస్టిక్ వ్యర్థాలను వినియోగించాలని 2016లో నితిన్ గడ్కరీ ప్రకటించారు. అప్పటి నుంచి 11 రాష్ట్రాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను రహదారుల నిర్మాణంలో ఉపయోగిస్తున్నారు.

ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ ముసాయిదా..
మొత్తం మున్సిపల్ ఘన వ్యర్థాల ఉత్పత్తి 55 నుంచి 65 మిలియన్ టన్నులుగా ఉంటే.. అందులో ప్లాస్టిక్ వ్యర్థాలు 5 నుంచి 6 శాతం ఉన్నాయని నివేదిక పేర్కొంది. ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించడానికి కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ.. డ్రాఫ్ట్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్-2021తో ముందుకు వచ్చింది. ఇది 2021 జనవరి 1 నుంచి నిర్దిష్ట సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తయారీ, దిగుమతి, నిల్వ, పంపిణీ, అమ్మకం, వాడకంపై నిషేధాన్ని ప్రతిపాదించింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌లో బెలూన్లు, క్యాండీ స్టిక్స్, ప్లాస్టిక్ జెండాలు, థర్మోకోల్ లాంటివి ఉన్నాయి.
Published by:Veera Babu
First published: