Home /News /trending /

HERE TAKE A LOOK ABOUT THE WORLDS MOST EXPENSIVE PILLOW WHICH IS AVAILABLE AT A STAGGERING PRICE SRD

World's Most Expensive Pillow : ఈ దిండు ఖరీదు తెలిస్తే నిద్రపట్టదు.. దీనికి మంచం కన్నా బీరువా అవసరమే ఎక్కువ..

World's Most Expensive Pillow

World's Most Expensive Pillow

World's Most Expensive Pillow : మనం మాట్లాడుతున్న దిండుకి ఇంత ఎక్కువ ధర ఉండడం వల్ల తలపై ఆనించుకునే బదులు దొంగతనం జరిగిపోతుందేమోనన్న భయంతో నిద్ర పట్టదు. దీన్ని కొనాలంటే ముందు మనం చాలా అమ్ముకోవాలి.

    మనిషికి నిద్ర (Sleep) చాలా ముఖ్యం. మంచి నిద్ర (Good Sleep)కు మంచి మంచం మరియు తలగడ (Pillow) కూడా అవసరం. ఈ రెండూ సరిగా లేకుంటే మనిషికి సరిగ్గా నిద్ర పట్టదు. దీంతో ఆయన ఆరోగ్యం కుదుటపడటంతో పాటు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సౌకర్యవంతమైన నిద్రకు సౌకర్యవంతమైన తలగడ కూడా అవసరం. ఇది తల మరియు మెడకు కొద్దిగా ఎత్తు ఇవ్వడమే కాక, మీ నిద్ర భంగిమను అనుసరించి అదనపు దిండ్లు ఉంచడం ద్వారా మీరు నిద్రను మరింత సౌకర్యవంతంగా చేయవచ్చు. కానీ తలనొప్పి లేకుండా నిద్రపోవడం కోసం ఓదార్పు మాత్రమే కాదు, కానీ దీని వల్ల కొన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి.

    భారతదేశంలో, చాలా ఇళ్లలో దూదితో నింపిన దుప్పట్లు మరియు దిండ్లు ఉపయోగించబడతాయి. కానీ పట్టణీకరణ పెరుగుతున్న కొద్దీ మార్కెట్‌లోకి చాలా రకాల దిండ్లు రావడం మొదలయ్యాయి. వీటిలో కొన్ని ఆరోగ్య ప్రయోజనాల కోసం ఉత్తమమైనవిగా చెప్పబడుతున్నాయి, మరికొన్ని కొన్ని ప్రత్యేకతలను కలిగి ఉంటాయి. కానీ ఈ రోజు మేం చెప్పబోయే దిండు గురించి తెలిస్తే మీకు కచ్చితంగా నిద్ర పట్టదు. అందుకు ముఖ్య కారణం దాని ఖరీదు.



    మనం మాట్లాడుతున్న దిండుకి ఇంత ఎక్కువ ధర ఉండడం వల్ల తలపై ఆనించుకునే బదులు దొంగతనం జరిగిపోతుందేమోనన్న భయంతో నిద్ర పట్టదు. దీన్ని కొనాలంటే ముందు మనం చాలా అమ్ముకోవాలి. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఈ దిండు విలువ 57వేల డాలర్లు. భారతీయ కరెన్సీ‌లో చెప్పాలంటే దాదాపు రూ.45లక్షలు. కాగా.. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారి కోసం అనేక రకాల పిల్లోలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నా.. ఇది మాత్రం ఎందుకంత ఖరీదు? ఇంతకూ దీని స్పెషాలిటీ ఏంటి? ఇక్కడ తెలుసుకుందాం.

    ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పిల్లో‌ను నెదర్లాండ్‌కు చెందిన ఫిజియోథెరపిస్ట్ తయారు చేశాడు. ఈ దిండును తయారు చేయడానికి ఆ థెరపిస్ట్‌కు దాదాపు 15 సంవత్సరాల సమయం పట్టిందట. ఇందుకోసం అనేక పరిశోధనలు చేసినట్లు సమాచారం. ఇక అసలు విషయానికి వస్తే.. ఈ దిండులో కాటన్‌ను రొబోటిక్ మిల్లింగ్ మిషన్ ద్వారా అమర్చారట. అంతేకాకుండా ఈ పిల్లో తయారీకి బంగారం, డైమెండ్లను కూడా ఉపయోగించారట. దిండుకు ఉన్న జిబ్‌కు నాలుగు ఖరీదైన డైమెండ్లు ఉన్నాయట.

    ఇది కూడా చదవండి :  కుల, మతాలకు అతీతంగా పెళ్లి ఆహ్వానపత్రికలో 900 కుటుంబాల పేర్లు.. సూపరో సూపర్..

    వీటితోపాటు విలువైన నీలి రంగు రాయిని కూడా ఈ పిల్లోకు అమర్చారట. దీంతో ఈ పిల్లో ధర భారీగా పలుకుతోంది.అయితే.. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వాళ్లు ఈ దిండును వేసుకుంటే.. ప్రశాంతంగా నిద్రపోతారని ఫిజియోథెరపిస్ట్ బల్లగుద్దీ మరీ చెబుతున్నాడు. అయితే పిల్లోకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ కావడంతో.. నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. దీన్ని కొంటే హాయిగా నిద్రపోవడం పక్కన పెడితే.. ఉన్న నిద్ర కూడా పోతుంది. అందుకు కారణం దొంగల భయం అంటూ కామెంట్లు చేస్తున్నారు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Sleep, Trending news, VIRAL NEWS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు