Viral Video: గుంతలో దిగబడిపోయిన లారీని బయటకు తీయాలని చూస్తే ఏం జరిగిందో చూడండి..

వర్షకాలంలో బురద రోడ్లపై ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తోంది. కేవలం బైక్‌లపై వెళ్లేవారికే కాదు.. భారీ వాహనాల డ్రైవర్లు కూడా బుదర రోడ్లపై వెళ్లేందుకు భయపడిపోతుంటారు.

news18-telugu
Updated: October 12, 2020, 6:10 PM IST
Viral Video: గుంతలో దిగబడిపోయిన లారీని బయటకు తీయాలని చూస్తే ఏం జరిగిందో చూడండి..
ఫొటో క్రెడిట్- Twitter/Fred Schultz
  • Share this:
వర్షకాలంలో బురద రోడ్లపై ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తోంది. కేవలం బైక్‌లపై వెళ్లేవారికే కాదు.. భారీ వాహనాల డ్రైవర్లు కూడా బుదర రోడ్లపై వెళ్లేందుకు భయపడిపోతుంటారు. బైక్‌పై వెళ్లేవారు స్కిడ్ అవుతుందేమోనని, భారీ వాహనాల వారు బురద గుంతలో వాహనం దిగబడితే ఎలా అని ఆలోచిస్తుంటారు. భారీ వాహనం గుంతలో దిగబడితే దాన్ని బయటకు తీసుకురావడానికి చాలా శ్రమపడాల్సి వస్తోంది. తాజాగా అలాంటి ఓ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ మారింది. అయితే గుంతలో దిగబడిన లారీని చేసేందుకు చేసిన ప్రయత్నం చేయగా.. అది కాస్త విఫలమైంది.

ఇంతకి ఆ వీడియోలో ఏముందంటే.. ఓ భారీ లారీ బురద రోడ్డుపై దిగబడిపోయింది. దీంతో అక్కడున్నవారు దాని బయటకు లాగేందుకు మరో తేలికపాటి వాహనం సాయం తీసుకున్నారు. లారీ ముందు భాగంలో తాడు కట్టి.. దానిని మరో వాహనానికి జోడించారు. తాడు కట్టిన వాహనాన్ని ముందుకు పొనిచ్చి.. లారీని లాగే ప్రయత్నం చేశారు. అయితే తాడు కట్టడంలో లోపం వల్లనో, లేక ఆ వాహనం లారీ బరువును లాగలేకపోవడం వల్లనో తెలియదు కానీ ఆ ప్రయత్నం విఫలమైంది. లారీకి బదులు దాని ముందు టైర్ ముందుకు ఊడిపోయి వచ్చింది.




Fred Schultz అనే ట్విటర్ యూజర్ షేర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. అయితే ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందనే వివరాలు మాత్రం ఆ ట్విటర్ యూజర్ వెల్లడించలేదు.
Published by: Sumanth Kanukula
First published: October 12, 2020, 5:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading