హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

SPB Health Update: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై లేటెస్ట్ అప్‌డేట్

SPB Health Update: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై లేటెస్ట్ అప్‌డేట్

ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP Balu)

ఎస్పీ బాలసుబ్రమణ్యం (SP Balu)

SP Balasubramanyam Health: కరోనా బారినపడి చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన తాజా వివరాలను ఆయన తనయుడు ఎస్పీ చరణ్ వెల్లడించారు.

  కరోనా బారినపడి చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన తాజా వివరాలను ఆయన తనయుడు ఎస్పీ చరణ్ వెల్లడించారు. ఆస్పత్రిలో తన తండ్రి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నెమ్మదిగా కోలుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు. నిన్నటితో పోలిస్తే తన తండ్రి ఆరోగ్య పరిస్థితిపై కొత్త సమాచారం ఏమీ లేదంటూ ఓ ప్రటకన విడుదల చేశారు. తన తండ్రి కోలుకుని క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

  కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో ఈ నెల మొదటి వారంలో ఎస్పీబీ ఆస్పత్రిలో చేరారు. వెంటిలేటర్‌, ఎక్మో సాయంతో ఐసీయూలో ఆయనకు చికిత్స కల్పిస్తున్నారు. ఎస్పీబీ క్షేమంగా ఇంటికి చేరుకోవాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన ఫ్యాన్స్, సెలబ్రిటీలు ఆకాంక్షిస్తున్నారు. ఇందు కోసం ఇటీవల సామూహిక ప్రార్థనలు కూడా నిర్వహించారు.

  Published by:Janardhan V
  First published:

  Tags: SP Balasubrahmanyam

  ఉత్తమ కథలు