Home /News /trending /

HERE ARE THE DETAILS ABOUT HOW TIKTOK 12 3 30 WORKOUT IS REDUCE WEIGHT AND GOES VIRAL PRN GH

Weight loss: బరువు తగ్గడానికి టిక్ టాక్ ఫార్ములా... మీరూ ట్రై చేస్తారా..?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

చాలామంది స్లిమ్ (Slim Exercise) గా ఉండాలని భావిస్తుంటారు. ఉన్నఫళంగా లావు తగ్గిపోవాలని (Weight Loss) చూస్తుంటారు. బరువు తగ్గడానికి అనేక విధానాలు అవలంభిస్తూ ఉంటారు.

చాలామంది స్లిమ్ (Slim Exercise) గా ఉండాలని భావిస్తుంటారు. ఉన్నఫళంగా లావు తగ్గిపోవాలని (Weight Loss) చూస్తుంటారు. బరువు తగ్గడానికి అనేక విధానాలు అవలంభిస్తూ ఉంటారు. కొందరు కడుపు మాడ్చుకొని సన్నంగా నాజూగ్గా మారిపోవాలని చూస్తుంటారు. వెయిట్ లాస్ కోసం వ్యాయామం చేయడం, ఆహార నియమాలు పాటించడం చేస్తుంటారు. చాలామంది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సమాచారాన్ని సైతం నమ్ముతారు. తాజాగా టిక్ టాక్‌లో 12-3-30 వర్కవుట్ (Tiktok 12-3-30 workout) ఫార్ములా చాలా పాపులర్ అయింది. దీనికి సంబంధించిన వీడియోను లారెన్ గిరాల్డ్ అనే యూజర్ టిక్‌టాక్‌లో పోస్ట్ చేయగా.. అది వైరల్‌ (Viral)గా మారింది. దీంతో దీని గురించి నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

‘బరువు తగ్గడానికి రకరకాల వ్యాయామాలు చేస్తూ ఉంటారు. ఇందుకు నేను ముందుగా ట్రెడ్ మిల్ సెట్టింగ్స్ మార్చుకుంటూ చివరగా 12 ఇంక్లైన్.. అంటే గరిష్టంగా సెట్టింగ్స్ పెట్టాను, గంటకు 3 మైళ్ల వేగం సెట్ చేశాను. అంటే కేవలం నడకలాంటిదే. ప్రతి రోజూ 30 నిమిషాలు ఇలా వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉండవచ్చని మా బామ్మ ఎప్పుడూ చెప్పే మాటలు నాకు గుర్తుకు వచ్చాయి’ అంటూ సోషల్ మీడియాలో లారెన్ గిరాల్డ్ పోస్ట్ చేసిన వీడియో తెగ వైరల్ గా మారింది.

ఇది చదవండి: నువ్వుల నూనెతో ఇన్ని ప్రయోజనాలున్నాయా..? ఆయుర్వేదం ఏం చెబుతోందంటే..!



ఈ ఫార్ములా ఏంటి?
ట్రెడ్ మిల్ పై ఇంక్లైన్ లెవల్ 12, వేగం గంటకు 3మైళ్లు సెట్ చేసి 30 నిమిషాలు ఒకేసారి ఆపకుండా నడవాలి. ఇలా చేయడం ద్వారా 12 నుంచి 13 కేజీల బరువు తగ్గుతారని గిరాల్డ్ తెలిపారు. ఈ వ్యాయామం చాలా సింపుల్ గా చేయవచ్చు. ట్రెడ్ మిల్ పై వేగంగా నడవడం వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ప్రతి రోజూ నడవడం వల్ల కొవ్వును సమర్థంగా కరిగిస్తుంది. కొత్తగా వ్యాయామం ప్రారంభించే వారికి కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది.

ఇది చదవండి: చిన్నారుల్లో గురక ఎందుకు వస్తుంది..? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..!



నడవడం అనేది బిగినర్స్ వ్యాయామం అని కూడా చెప్పవచ్చు. 12-3-30 వర్కవుట్ ప్లాన్ ద్వారా అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రారంభంలో నిదానంగా ప్రారంభించి తరువాత కఠినంగా పెంచుకుండా పోవడం వల్ల వేగంగా బరువు తగ్గుతారు. నడవడం, తాడు సాయంతో పాకడం లాంటి వ్యాయామాలు క్యాలరీలను కరిగించడంలో చక్కగా ఉపయోగపడతాయి.

ఇది చదవండి: బరువు తగ్గాలని అన్నం మానేస్తున్నారా.. ఫుడ్‌లో అన్నం ఉండాల్సిందే.. ఈమాటన్నది..


ఈ వ్యాయామం ద్వారా గుండె పనితీరు, స్వల్ప కాలంలో కాలరీలు కరిగించడంలో చక్కగా ఉపయోగపడుతుంది. పరుగెత్తడం, కఠినమైన వ్యాయామాలు చేయలేని వారికి కూడా టిక్ టాక్ 12-3-30 వర్కవుట్ ద్వారా బరువు తగ్గవచ్చు. చిన్న చిన్న వ్యాయామాలు సరైన పద్దతిలో దీర్ఘకాలం చేయడం ద్వారా ప్రయోజనం ఉంటుంది. దీనికితోడు ఆహార సమతుల్యత కూడా పాటించాలి. శారీరకంగా చురుగ్గా ఉన్న వారు ప్రతి రోజూ 30 నుంచి 45 నిమిషాలపాటు ఈ వ్యాయామం చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Published by:Purna Chandra
First published:

Tags: Life Style, Tiktok, Weight loss

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు