హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral Video : వావ్.. ఈ బాతు చేసిన సాహసం చూసి తీరాల్సిందే

Viral Video : వావ్.. ఈ బాతు చేసిన సాహసం చూసి తీరాల్సిందే

వావ్.. ఈ బాతు చేసిన సాహసం చూసి తీరాల్సిందే (image credit - reddit - asilvertintedrose)

వావ్.. ఈ బాతు చేసిన సాహసం చూసి తీరాల్సిందే (image credit - reddit - asilvertintedrose)

ధైర్యం.. రెండు అక్షరాల ఈ పదం మనకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. మనందరికీ జీవితంలో ఎన్నో సందర్భాల్లో సవాళ్లు ఎదురవుతాయి. వాటిని ఎదుర్కొనే క్రమంలో ఎన్నో ఇబ్బందులు పడతాం. ఈ సమస్య గట్టెక్కితే చాలు అనుకుంటాం. అలాంటి పరిస్థితి ఓ బాతుకు ఎందురైంది. మరి అది ఏం చేసింది? ఎలా ముందడుగు వేసింది? ఎలా ధైర్య సాహసాలు ప్రదర్శించింది? వైరల్ అయిన ఆ వీడియో చూసి తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

సోషల్ మీడియాలో కొన్ని కొన్ని వీడియోలను చూస్తే.. ఏదో తెలియని ఆనందం మనకు కలుగుతుంది. ఆ ఆనందం ఆ రోజంతా మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. కారణం ఆ వీడియోలో మనకు ప్రేరణ కలిగించే అంశం ఏదో ఉంటుంది. దాన్ని చూసి తెలియకుండానే మనం ఇన్స్‌పైర్ అవుతాం. అలాంటి ఓ వీడియో ఇప్పుడు నెటిజన్ల హృదయాలు గెలుచుకుంటోంది. ఆ వీడియోని గమనిస్తే.. అందులో ఓ మైదాన ప్రాంతంలో.. కొన్ని ఆవుల గుంపు ఉన్న చోటికి వెళ్లిన ఓ బాతు వాటి మధ్యలో చిక్కుకుంది. బాతును రౌండప్ చేసిన ఆవులు.. దానితో ఓ ఆట ఆడుకోవాలని డిసైడ్ అయ్యాయి.

మామూలుగా అయితే.. ఆవులు, గేదెల వంటివి కొట్టుకుంటే.. బలంగానే ఢీకొట్టుకుంటాయి. రంకెలు వేసి మరీ కొమ్ములతో గుద్దుకుంటాయి. ఇక్కడ తమ ముందు ఉన్న ప్రత్యర్థి బాతు. కాబట్టే.. ఆవులు తెలివిగా వ్యవహరించాయి. బాతును తలతో ఢీకొడుతున్నట్లుగా నటించాయి. బాతు దగ్గరకు వచ్చి.. తలను బాతు ముక్కుకు ఆనించి.. వెనక్కి వెళ్లిపోయాయి. అలా అవి దానితో ఆడుకున్నాయి.

Karnataka: ఆర్టీసీ బస్‌లో ల్యాప్‌టాప్ తీసుకెళ్తున్నాడని లగేజీ ఛార్జీ 10రూపాయలు వసూలు .. ఎక్కడంటే..?

ఆవులు మనతో అలా చేస్తే.. మనం భయపడతామేమో.. బాతు మాత్రం ధైర్యం ప్రదర్శించింది. "రండి చూసుకుందాం.. మీ ప్రతాపమో.. నా ప్రతాపమో" అన్నట్లు.. అడుగులు ముందుకే వేసింది. దాని ధైర్యాన్ని చూసి ఆవులే ఆశ్చర్యపోయి వెనక్కి తగ్గాయి. కష్ట సమయాల్లో మన ధైర్యమే మనల్ని ముందుకు నడిపిస్తుంది అనే సత్యాన్ని ఈ వీ‌డియో నిరూపిస్తోంది.

ఆ వీడియో (viral video)ని ఇక్కడ చూడండి

ఫీల్ గుడ్ అంటున్న నెటిజన్లు

ఈ వీడియోని రె‌డ్డిట్ లోని.. asilvertintedrose యూజర్ పోస్ట్ చెయ్యగా.. దీనికి ఇప్పటివరకూ 2వేలకు పైగా అప్ ఓట్లు వచ్చాయి. "కెనడా బాతులు కఠినంగా ఉంటాయి. నేను కొలరాడోలో ఇలాంటి బాతుల గుంపును చూశాను. అవి మనుషులపై దాడి చేస్తాయి కూడా" అని ఓ యూజర్ తెలపగా.. "ఇలాంటి వీడియోలను డబ్బులిచ్చి చూసేందుకు కూడా ప్రజలు ఇష్టపడతారు" అని మరో యూజర్ స్పందించారు.

"మీరు గెలవలేరు.. అని ఆ బాతు ఆంటోంది" అని మరో యూజర్ కామెంట్ ఇవ్వగా.. "చిన్న బ్రెయిన్.. పెద్ద యాటిట్యూడ్ (వైఖరి)" అని మరో యూజర్ కామెంట్ రాశారు. "ఆవులు చాలా మంచివి. బాతులు మాత్రం జెర్క్ ఇస్తాయి" అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు.

First published:

Tags: International news, Viral, Viral Videos

ఉత్తమ కథలు