HEARTBREAKING STORY OF CHAIN SMOKING CHIMP WHO PUFFED 40 A DAY BEFORE KICKING HABIT PVN
Chain Smoking Chimp : ఈ చింపాంజీ అప్పట్లో రోజుకి 40 సిగరెట్లు కాల్చేది..కానీ ఇప్పుడు
స్మోక్ చేస్తున్న చింపాంజీ
Smoking Chimp : జూ అతిథులను వినోదభరితంగా చేయడం కోసం బలవంతంగా రోజుకి 40 సిగరెట్లు పైనే కాల్చేదట. అంతేకాదు దాని సిగరెట్ అదే అంటించుకుంటుంది. దాని ట్రైనర్ భయటి నుండి లైటర్ లోపల వేయగానే అచ్చం మనిషిలాగానే స్టైల్‌గా సిగరెట్ అంటించుకుంటుంది. అయితే లైటర్ అందుబాటులో లేకపోతే సిగరెట్ ఎలా అంటించుకోవాలో కూడా తెలుసు ఈ చింపాంజీకి.
Smoking Chimp : సిగరెట్ తాగితే ఆరోగ్యం పాడవుతుంది..ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని మనకు తెలిసిందే. అయినప్పటికీ స్మోకింగ్ అలవాటుగా మారినవాళ్లు మాత్రం ఇవేవీ పట్టుకోకుండా ధూమపానం చేస్తూ అనారోగ్యం పాలైన తర్వాత అయ్యో అని ఫీల్ అవుతుంటారు. అయితే మనుషుల సంతోషం కోసం ఓ చింపాంజీ బలవంతంగా రోజుకి 40 సిగరెట్లు కాల్చేది. హృదయాన్ని కదిలించే ఈ చింపాంజి గురించి తెలిస్తే కళ్లల్లో నీళ్లు తిరగడం ఖాయం.
ఉత్తరకొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ లో 2016లో పాతకాలపు జూ(ZOO)ని మళ్లీ మరమ్మత్తులు చేసి ప్రారంభించారు అక్కడి అధికారులు. అయితే జూ పూర్వవైభవాన్ని మళ్లీ తీసుకురావలంటే ఎదైనా కొత్తగా ఉండాలని వారు ఆలోచించారు. ఈ క్రమంలో జంతుప్రదర్శనశాలకు సందర్శకులను అలరించేందుకు డల్లే(25) అని పిలువబడే చింపాంజీకి సిగరెట్లను కాల్చడంలో శిక్షణ ఇచ్చారు. దీంతో జూకి వచ్చే వారందరినీ ఈ చింపాంజీ తన స్మోకింగ్ స్ట్రైల్స్ తో విశేషంగా ఆకట్టుకునేది. జూ స్టార్ ఎట్రాక్టన్ గా మారిపోయింది డల్లే. కొందరు అయితే ప్రత్యేకంగా ఈ చింపాంజీ కోసమే జూకి వచ్చేవారట.
డాలీ రోజుకు సిగరెట్ ప్యాకెట్ కాలుస్తుందట. జూ అతిథులను వినోదభరితంగా చేయడం కోసం బలవంతంగా రోజుకి 40 సిగరెట్లు పైనే కాల్చేదట. అంతేకాదు దాని సిగరెట్ అదే అంటించుకుంటుంది. దాని ట్రైనర్ భయటి నుండి లైటర్ లోపల వేయగానే అచ్చం మనిషిలాగానే స్టైల్‌గా సిగరెట్ అంటించుకుంటుంది. అయితే లైటర్ అందుబాటులో లేకపోతే సిగరెట్ ఎలా అంటించుకోవాలో కూడా తెలుసు ఈ చింపాంజీకి.. ఎలాగంటే ఒక అంటించిన సిగరెట్‌ను విసిరేస్తే.. దాంతో సిగరెట్ అంటించుకుంటుంది. ఇక తనను చూడ్డానికి వచ్చిన సందర్శకులకు వంగి మరీ ధన్యవాదాలు తెలుపుతుంది. ఈ జూలో ఇదొక్కటే కాదు. ఇంకా చాలా వింతలున్నాయి. ఇక్కడ బాస్కెట్ బాల్ ఆడే కోతులు అడుతాయి. ట్రైన్డ్ శునకాలు కూడికలు,తీసివేతలు అబాకస్ లెక్కలు చేస్తాయట.
ALSO READ Black Diamond: అంతరిక్షం నుంచి భూమిపై పడిన వజ్రం..! ఆన్లైన్లో వేలం.. ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు..!
అయితే ఈ జూలో జంతువుల పట్ల అధికారులు క్రూరంగా వ్యవహరిస్తున్నారంటూ జంతుప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ ప్రెసిడెంట్ ఇంగ్రిడ్ న్యూకిర్క్ మాట్లాడుతూ.. "మానవ వినోదం కోసం చింపాంజీని ఉద్దేశపూర్వకంగా స్మోకింగ్ కు అలవాటు చేయడం క్రూరమైనది" అని పేర్కొన్నాడు.
అనేక ఫిర్యాదులు మరియు సలహాల తర్వాత డల్లే చివరకు తన రోజుకి 40 సిగరెట్ల అలవాటును వదిలేసింది. స్వీడిష్ జూ నిపుణుడు జోనాస్ వాల్స్ట్రోమ్.. డల్లే ధూమపానం వెంటనే మానేయాలని పట్టుబట్టిన ఉన్నవారిలో ఉన్నారు. స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లోని వైల్డ్‌లైఫ్ పార్క్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న జోనాస్...నార్త్ కొరియా జూలోని సిబ్బందికి సహాయం చేయడానికి గత 30 సంవత్సరాలుగా జూకి అనేకసార్లు వెళ్లారు. కానీ డల్లే సిగరెట్‌ను వెలిగించడం చూసినప్పుడు మాత్రం అతను కోపంగా ఉండేవాడు. చింపాంజీకి సిగరెట్లు ఇవ్వడం మానేయమని కీపర్లకు చెప్పవారు. చింపాంజీకి సిగరెట్లు ఇవ్వడం ఖచ్చితంగా సాధ్యం కాదని నేను వారికి గట్టిగా చెప్పాను" అని అతను గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. 30 సంవత్సరాల క్రితం యూరోపియన్ జంతుప్రదర్శనశాలలలో ఇలాంటి ప్రదర్శను ఉండేవని,అదృష్టవశాత్తూ వారు దానిని ఆపేశారని జోనాస్ చెప్పారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.